Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లక్ష్, వేదిక దత్తు జంటగా నటిస్తున్న చిత్రం 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు'. ఈ చిత్రాన్ని శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై చదలవాడ బ్రదర్స్ సమర్పణలో పద్మావతి చదలవాడ నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఇషాన్ సూర్య దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ నటీ నటులు నటిస్తున్న ఈ చిత్రం శుక్రవారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో రెగ్యులర్ చిత్రీకరణ ప్రారంభమైంది. ముహూర్తపు షాట్‌కు నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు క్లాప్ ఇచ్చారు. యాక్షన్ ఎంటర్టైనర్గా ప్రేక్షకులను థ్రిల్ చేసే ఈ సినిమా శుక్రవారం నుండి హైదరాబాద్, అరకు ప్రాంతాల్లో ఏకధాటిగా జరిగే రెండు షెడ్యూల్స్‌లో చిత్రీకరణను పూర్తి చేయనున్నారు. ఈ చిత్రానికి మ్యూజిక్: సాయి కార్తీక్, డివోపి: కన్నా పి.సి, ఎడిటర్: అనుగోజు రేణుక బాబు, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : భరత్ వెనిగళ్ల.