Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'6 టీన్స్, జానకి వెడ్స్ శ్రీరామ్, గుడ్బారు, నేను సీతామాలక్ష్మి, నవవసంతం, సొంతం' వంటి సినిమాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ 'కళాకార్' చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. శ్రీను బందెల దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని ఏజీ అండ్ ఏజీ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం నిర్మిస్తున్నారు. షాయాజీషిండే, పథ్విరాజ్, రాజీవ్ కనకాల, శివశంకర్, రవికాలే, గగన్, కరాటే కళ్యాణి, జయలలిత, అశోక్‌కుమార్ తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన సందర్భంగా హీరో రోహిత్ మాట్లాడుతూ,'ఫస్ట్ టైమ్ ఒక యాక్షన్ మూవీ చేస్తున్నాను. ఈ సినిమాలో నాదొక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్. సినిమా చాలా బాగా వచ్చింది. శ్రీను మేకింగ్ కొత్తగా ఉంది. డెఫినెట్‌గా ఈ మూవీ ఒక కమర్షియల్ ఎంటర్టైనర్గా మిమ్మల్ని అలరిస్తుంది' అని చెప్పారు. చిత్ర నిర్మాత వెంకటరెడ్డి జాజాపురం మాట్లాడుతూ, 'మా బ్యానర్లో రూపొందుతున్న రెండవ చిత్రం 'కళాకార్'. మంచి బడ్జెట్, భారీ తారాగణంతో దర్శకుడు శ్రీనివాస్ బందెల ఈ సినిమాని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు' అని చెప్పారు.
'కళాకారుల నేపథ్యంతో రూపొందుతున్న సస్పెన్స్ థ్రిల్లర్ సబ్జెక్ట్ ఇది. సినిమా పరిశ్రమపై మక్కువతో ఎంతో మంది ఇండిస్టీకి వస్తుంటారు. వారిలో కొంత మంది ఇండిస్టీలో రాణిస్తుంటారు. మరి కొంత మంది తిరిగి వెళ్లిపోతుంటారు. అయితే తిరిగి వెళ్లలేని కొంత మంది జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించాం. సమ్మర్ స్పెషల్‌గా సినిమాని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. ఈ సినిమాలో యాక్షన్ సీక్వెన్స్‌లు, సస్పెన్స్ ఎలిమెంట్స్ తప్పకుండా మిమ్మల్ని థ్రిల్ చేస్తాయి' అని దర్శకుడు శ్రీను బందెల తెలిపారు.