Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగశౌర్య, రీతువర్మ జంటగా లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ రూపొందిస్తున్న చిత్రం 'వరుడు కావలెను'. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. శుక్రవారం హీరో నాగ శౌర్య పుట్టినరోజు. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఓ అందమైన, ఆకర్షణీయమైన వీడియోను విడుదల చేసింది. అందమైన కథానాయకుడు నాగశౌర్య మరింత అందంగా ముస్తాబవుతున్న దశ్యాలు ఎంతో అందంగా కనిపిస్తాయి. వీడియో చివరలో 2021, మే నెలలో చిత్రం విడుదల అవుతుందన్న విషయం కూడా తెలుస్తుంది. ఇంతకు ముందు లాగానే ఈ వీడియో చిత్రానికి సంగీత దర్శకుడు విశాల్ చంద్ర శేఖర్ అందించిన నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది.
సినిమా టైటిల్ కోసం అధికారిక ప్రకటన చేస్తూ ఓ వీడియోను కూడా ఇటీవల విడుదల చేశారు. ఈ వీడియోలో కూడా నాగశౌర్య, రీతువర్మ ఎంతో అందంగా కనిపించారు. ఆ తర్వాత నూతన సంవత్సర శుభాకాంక్షలు చెబుతూ ఓ ప్రచార చిత్రం విడుదలైంది. ఇందులోనూ చూడ ముచ్చటగా నాగశౌర్య, రీతువర్మ జంట కనిపిస్తుంది. ఇవన్నీ ప్రేక్షకాభిమానులను ఎంతగానో అలరించాయి. ప్రస్తుతం చిత్ర నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ చిత్ర కథ, కథనం, మాటలు, పాటలు, సన్నివేశాలు, భావోద్వేగాలు, నటీ నటుల అభినయం, చిత్ర కథానుగుణంగా సాగి అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తాయనే నమ్మకాన్ని దర్శక, నిర్మాతలు వ్యక్తం చేస్తున్నారు.