Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కథానాయిక పూర్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'బ్యాక్ డోర్'. కర్రి బాలాజీ దర్శకత్వంలో ఆర్కిడ్ ఫిలిం స్టూడియోస్ పతాకంపై బి.శ్రీనివాస్ రెడ్డి నిర్మిస్తున్నారు. యువ కథానాయకుడు తేజ త్రిపురాన మరో ముఖ్య పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు కర్రి బాలాజీ మాట్లాడుతూ, 'పూర్ణ కెరీర్లో ఓ మైల్‌స్టోన్‌గా నిలిచే చిత్రమిది. పూర్ణ నటన, గ్లామర్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణలుగా నిలుస్తాయి. వినూత్న కథా చిత్రంగా ప్రేక్షకులను అలరిస్తుంది' అని చెప్పారు. 'దర్శకుడిగా బాలాజీకి చాలా మంచి పేరు తెచ్చే చిత్రమిది. మా సినిమా చేస్తుండగానే పూర్ణకి బాలకష్ణ-బోయపాటి కాంబినేషన్ సినిమా రావడం మాకు చాలా సంతోషం కలిగించింది. అలాగే కంగనా రనౌత్ నటిస్తున్న జయలలిత బయోపిక్‌లోనూ పూర్ణ నటిస్తుండటం మాకెంతో గర్వకారణం. ఈ చిత్రం ఆమె కెరీర్‌కి మరో టర్నింగ్ పాయింట్‌గా నిలుస్తుంది' అని నిర్మాత బి.శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. హీరోయిన్ పూర్ణ మాట్లాడుతూ,' దర్శకుడు బాలాజీ ప్రతి సీన్‌ని ఎంతో ప్లానింగ్‌తో, క్లారిటీతో తెరకెక్కించారు. దర్శకుడిగా ఆయనకు, నాకు, ప్రొడ్యూసర్ శ్రీనివాస్ రెడ్డి గారికి మంచి పేరు తెచ్చే చిత్రమిది' అని చెప్పారు. ఈ చిత్రానికి కొరియోగ్రఫీ: రాజ్ కృష్ణ, పాటలు: జావళి, చాందిని, సంగీతం: ప్రణవ్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్: రవిశంకర్, ఆర్ట్: నాని, ఎడిటింగ్: చోటా కె.ప్రసాద్, కెమెరా: శ్రీకాంత్ నారోజ్, లైన్ ప్రొడ్యూసర్: రేఖ, కో-ప్రొడ్యూసర్: ఊట శ్రీను.