Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గురుశిష్యుల మధ్య ఒక అందమైన ప్రత్యేకమైన సంబంధాన్ని, అలాగే ఒక మంచి ప్రేమకథతో రూపొందిన చిత్రం 'నాట్యం'. మంచి కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ చిత్రం త్వరలోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోని థియేటర్స్‌లో విడుదల కాబోతుంది. హైదరాబాద్‌కు చెందిన సుప్రసిద్ధ కూచిపూడి నర్తకి సంధ్యరాజు తొలిసారిగా ఒక తెలుగు సినిమాలో నటించారు. తన నటన, ఎక్స్ప్రెషన్స్, డ్యాన్స్‌తో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేయబోతున్నారు. వ్యాపారవేత్త, ఉపాసన కొణిదెల శనివారం ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్లో సాంప్రదాయ చీరకట్టుతో క్లాసికల్ డాన్సర్‌గా సంధ్యరాజు తన పాత్రలో ఒదిగిపోయారు. అలంకరించిన నటరాజు విగ్రహం ముందు ఆమె ఒక నాట్య దేవతలా కనిపిస్తున్నారు. ఈ చిత్రంలో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందని తెలుసుకోవాలని ఆసక్తిని ఈ పోస్టర్ కలిగించడం విశేషం. ఈ సినిమాతో రేవంత్ కొరుకొండ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రానికి రచన, దర్శకత్వం వహించడంతో పాటు డిఓపి, ఎడిటర్ కూడా ఆయనే కావడం మరో విశేషం. గురుశిష్యుల మధ్య ఒక అందమైన ప్రత్యేకమైన సంబంధాన్ని, అలాగే ఒక మంచి ప్రేమకథతో ఈ సినిమా సాగుతుంది. కమల్ కామరాజు, రోహిత్ బెహల్ కీలక పాత్రల్లో నటించారు. శ్రవణ్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చారు. దక్షిణ భారతదేశంలోని హంపి, లేపాక్షి, బెంగళూరు, హైదరాబాద్‌లోని ప్రముఖ దేవాలయాల్లో విజువల్ బ్యూటీగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సంధ్యరాజు, కమల్‌కామరాజు, రోహిత్ బెహల్, ఆధిత్య మీనన్, శుభలేఖ సుధాకర్, భానుప్రియ, బేబి దేవన తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్ హౌస్: నిశ్రింకళ ఫిల్మ్స్, లిరిక్స్: కరుణాకర్ ఆదిగర్ల, ఆర్ట్: మహేష్ ఉప్పుటూరి, ప్రొడక్షన్ డిజైనర్: సంధ్యరాజు, ప్రొడక్షన్ కంట్రోలర్: వాల్మికి శ్రీనివాస్, రచన, సినిమాటోగ్రఫి, ఎడిటింగ్, దర్శకత్వం: రేవంత్ కొరుకొండ.న