Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నందితశ్వేతా ప్రధాన పాత్రధారిగా నటించిన చిత్రం 'అక్షర'. సినిమా హాల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై బి.చిన్నికృష్ణ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సురేష్ వర్మ అల్లూరి,అహితేజ బెల్లంకొండ నిర్మించిన ఈ సినిమా ఫిబ్రవరి 26న రిలీజ్‌కి సిద్ధమైంది. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ,'సోషల్ మెసేజ్‌తో పాటు కామెడీ థ్రిల్లర్‌గా మా సినిమా రూపొందింది. ఇప్పటికే రిలీజైన ఫస్ట్‌లుక్, టీజర్, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. కోవిడ్ కారణంగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఆఫర్లు వచ్చాయి. కానీ ఈ సినిమాని థియేటర్లలోనే ప్రేక్షకులు ఎక్స్‌పీరియెన్స్ అవ్వాలని ఇప్పటివరకు వెయిట్ చేశాం. ఇప్పటికే సగం బిజినెస్ అయిపోయింది. ఇంకా మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్ ఎక్కడా మిస్ అవ్వకుండా ఓ బర్నింగ్ ఘటనను ఈ సినిమాలో చర్చించబోతున్నాం. ప్రతి విద్యార్థి, తల్లిదండ్రులు తప్పకుండా చూడాల్సిన సినిమా ఇది. అన్ని వర్గాల ప్రేక్షకులను కూడా బాగా అలరిస్తుంది' అని అన్నారు. సత్య, మధునందన్, షకలక శంకర్, శ్రీ తేజ, అజరు ఘోష్ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా : నగేష్ బెనల్, సంగీతం : సురేష్ బొబ్బిలి, ఎడిటర్ : జి.సత్య, ఆర్ట్ డైరెక్టర్ : నరేష్ బాబు తిమ్మిరి, కో- ప్రొడ్యూసర్స్ : కె.శ్రీనివాస రెడ్డి, సుమంత్, రచన - దర్శకత్వం : బి.చిన్నికృష్ణ.