Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దర్శకుడు అనిల్ రావిపూడి సమర్పణలో రూపొందుతున్న చిత్రం 'గాలి సంపత్'. అనిల్ రావిపూడి ఈ చిత్రానికి సమర్పకుడిగా వ్యవహరించడంతో పాటు స్క్రీన్‌ప్లే అందిస్తూ, దర్శకత్వ పర్యవేక్షణ కూడా చేస్తున్నారు. అనిల్ కో - డైరెక్టర్, రైటర్, మిత్రుడు ఎస్.క్రిష్ణ నిర్మాతగా ఇమేజ్ స్పార్క్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌ను స్థాపించి, షైన్ స్క్రీన్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
శ్రీ విష్ణు, లవ్లీ సింగ్ జంటగా, డా.రాజేంద్ర ప్రసాద్ 'గాలి సంపత్'గా టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రానికి అనీష్ దర్శకత్వం వహిస్తున్నారు. మహా శివరాత్రి కానుకగా మార్చి11న ఈ సినిమా గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ, 'మార్చి 11న విడుదలయ్యే 'గాలి సంపత్' అద్భుతమైన నటీనటులతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి వస్తోంది. అందర్నీ అలరించే వెరైటీ సినిమా ఇది' అని అన్నారు. 'నేను ఎన్నో సినిమాలు చేశాను. కానీ గాలిసంపత్ పాత్ర చాలా డిఫరెంట్. ఇది ఒక కొత్త క్యారెక్టర్. కావాల్సినంత ఎంటర్టైన్మెంట్తో పాటు హదయాన్ని తాకే గుడ్ ఎమోషన్స్ ఉన్న చిత్రమిది' అని రాజేంద్రప్రసాద్ తెలిపారు. హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ, 'మహాశివరాత్రి రోజు మీ అభిమాన థియేటర్లలో మీ సమక్షంలో నేను, మా నాన్న కలవబోతున్నాం. మార్చి 11న కడుపు చెక్కలయ్యేలా నవ్వడానికి సిద్ధంగా ఉండండి' అని చెప్పారు. అందర్నీ ఎంటర్టైన్ చేసే సినిమా 'గాలి సంపత్' అని దర్శకుడు అనీష్ అన్నారు. నిర్మాత ఎస్.క్రిష్ణ మాట్లాడుతూ, 'ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ జరుగుతోంది. ఈ రోజే డబ్బింగ్ స్టార్ట్ చేశాం. పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తిచేసి మహాశివరాత్రి కానుకగా వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేస్తున్నాం' అని అన్నారు. తనికెళ్ల భరణి, సత్య, రఘుబాబు, శ్రీకాంత్ అయ్యంగార్, మిర్చి కిరణ్, సురేంద్ర రెడ్డి, గగన్, మిమ్స్ మధు, అనీష్ కురువిల్లా, రజిత, కరాటే కళ్యాణి, సాయి శ్రీనివాస్, రూపలక్ష్మి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కథ: ఎస్. క్రిష్ణ, రచనా సహకారం: ఆదినారాయణ, సినిమాటోగ్రఫి: సాయి శ్రీ రామ్, సంగీతం: అచ్చు రాజమణి, ఆర్ట్: ఎ.ఎస్.ప్రకాశ్, ఎడిటర్: తమ్మిరాజు, ఎమ్, మాటలు: మిర్చి కిరణ్, లిరిక్స్: రామజోగయ్య శాస్త్రి, ఫైట్స్: నభ, కొరియోగ్రఫి: శేఖర్, భాను, నిర్మాత: ఎస్. క్రిష్ణ, స్క్రీన్ ప్లే, సమర్పణ, దర్శకత్వ పర్యవేక్షణ: అనిల్ రావిపూడి, దర్శకత్వం: అనీష్.