రెండు దశాబ్దాల క్రితం విశేష ప్రేక్షకాదరణ పొంది, సంచలన విజయం సాధించిన సినిమా 'చిత్రం'. సినిమాటోగ్రాఫర్ తేజ దర్శకుడిగా ప్రేక్షకులకు పరిచయం అవుతూ తెరకెక్కించిన ఈ చిత్రం కాసుల వర్షం కురిపించింది. ఉదరుకిరణ్, రీమాసేన్ జంటగా రూపొందిన ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ని ఉషాకిరణ్ సంస్థ నిర్మించింది. తెలుగు సినీ చరిత్రలో ఓ ట్రెండ్ సృష్టించిన ఈ సినిమాకి సీక్వెల్ చేసే పనిలో దర్శకుడు తేజ ఉన్నారు. సోమవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా 'చిత్రం 1.1' పేరుతో సీక్వెల్‌ను ఈ ఏడాది తెరకెక్కించనున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు. 'చిత్రం' సినిమాతో పరిచయమైన 45 మంది టెక్నికల్ టీమ్ ఈ సీక్వెల్‌కి పని చేయనుండటం విశేషం.