గోపీచంద్ కథానాయకుడిగా కబడ్డీ నేపథ్యంలో తెరకెక్కుతున్న స్పోర్ట్స్ యాక్షన్ చిత్రం 'సీటీమార్'. తమన్నా కథానాయిక. సంపత్ నంది దర్శకత్వంలో పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో భూమిక కీలక పాత్ర పోషిస్తోంది. సమ్మర్ స్పెషల్‌గా ఏప్రిల్ 2న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదలవుతోంది. ఇదిలా ఉంటే, ఈ చిత్ర టీజర్‌ను సోమవారం చిత్ర బృందం రిలీజ్ చేసింది. ఈ సందర్భంగా డైరెక్టర్ సంపత్ నంది మాట్లాడుతూ, 'ఈ టీజర్ మీకు చూపించాలని ఎంతగానో ఎదురుచూశాం. మీకు తప్పకుండా నచ్చుతుందని, మీ ప్రేమ, ఆదరాభిమానాలు ఉండాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు. 'రేరు కార్తి..అంటూ రావు రమేష్ పిలవగానే 'నన్నెవడైనా అలా పిలవాలంటే ఒకటి.. మా ఇంట్లో వాళ్లు పిలవాలి లేదా నా పక్కనున్న ఫ్రెండ్స్ పిలవాలి..ఎవడు పడితే వాడు పిలిస్తే వాడి కూత ఆగిపోద్ది', అలాగే 'కబడ్డీ.. మైదానంలో ఆడితే ఆట.. బయట ఆడితే వేట' అని గోపీచంద్ చెప్పే డైలాగ్స్‌కి మంచి రెస్పాన్స్ వస్తోంది. పవర్‌ప్యాక్డ్ యాక్టింగ్‌తో స్టైలిష్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఉన్న ఈ టీజర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచింది' అని చిత్ర బృందం తెలిపింది.