Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నూతన నటుడు వంశీ ఆకుల హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'మొనగాడు'. పావని హీరోయిన్ గా నటించింది. కీలు గుర్రం ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై పక్కా విలేజ్ బాక్డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా వంశీ ఆకుల ఈ చిత్రాన్ని నిర్మించారు. ర్యాప్ రాక్ షకీల్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం ట్రైలర్, సాంగ్ లాంచ్ కార్యక్రమం శుక్రవారం హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అతిథిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు వీర శంకర్ మాట్లాడుతూ, 'మంచి కాన్సెప్ట్ చిత్రమిది. ఎప్పుడు వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. మొనగాడు టైటిల్ తో పాటు పోస్టర్స్ చాలా ఇంప్రెసివ్ గా ఉన్నాయి. వంశీ లుక్స్ ఎక్స్ ప్రెసివ్, ఐస్ స్ట్రైకింగ్ గా ఉన్నాయి. ట్రైలర్ చూడగానే మైండ్ బ్లాక్ అయ్యింది. రస్టిక్ ఫిల్మ్ ని కసితో ఫీల్ మిస్ అవకుండా పర్ఫెక్ట్ ఎనర్జిటిక్ గా చేసాడు. వంశీ. అప్పట్లో చిరంజీవి గారు ఎంత కాన్ఫిడెంట్ గా కసితో చేసేవారో ఇప్పుడు వంశీ 'మొనగాడు'లో చేశాడు. వంశీ రేసుగుర్రంలా పరుగెత్తి మరిన్ని మంచి సినిమాలు చేయాలి. ఇండిస్టీలో వెర్సటైల్ ఆర్టిస్ట్ గా పేరుతెచ్చుకోవాలి. 'మొనగాడు' సూపర్ హిట్ అవ్వాలి' అని అన్నారు. హీరో, డైరెక్టర్, ప్రొడ్యూసర్ వంశీ ఆకుల మాట్లాడుతూ, 'పదేళ్ల క్రితం ఇండిస్టీకి వచ్చాను. ఒక మెస్ లో పనిచేస్తూ, చాలా కష్టాలు పడ్డాను. అవకాశాల కోసం ఎంతగానో ప్రయత్నించాను. వర్కౌట్ కాక ఇంటికెళ్లిపోయాను. అప్పటినుండి ఒక మంచి సినిమా చేయాలని నా కోరిక. నాకు బ్యాక్ గ్రౌండ్ అంటూ ఏమీలేదు. అందుకే మంచి కథతో నేనే హీరోగా నటిస్తూ.. దర్శకత్వం చేసి ప్రొడ్యూస్ చేశాను. ఈ సినిమాకి మా టీమ్ అందరూ డైరెక్టర్లే. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఆడియెన్స్ అందర్నీ ఆకట్టుకుంటుంది' అని చెప్పారు.