Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'శ్రీరాం, భావనా చౌదరి, ఆర్యమాన్, మహబూబ్ బాషా, కె.యస్.రాజు, బస్వరాజ్ నటీనటులుగా ఉమాశంకర్ దర్శకత్వంలో సిల్వర్ పిక్సెల్ మీడియా వర్క్స్ పతాకంపై నిర్మిస్తోన్న చిత్రం 'సాఫ్ట్ వేర్ బ్లూస్'. ఈ చిత్రం మార్చి మూడవ వారంలో థియేటర్లలో విడుదలవుతున్న సందర్భంగా ఇటీవల ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో చిత్ర దర్శకుడు మాట్లాడుతూ, ''సాఫ్ట్ వేర్ బ్లూస్' అంటే ఎదో అనుకుంటున్నారు. బ్లూస్ అంటే కష్టాలు అని అర్థం. సాఫ్ట్ వేర్ ఎంప్లాయిస్ పడే కష్టాలను తెలియజేస్తూ లవ్, కెరీర్, ఫ్రెండ్స్ మధ్య నడుస్తుంది. హీరో బెస్ట్ పెర్ఫారర్ ఇయర్ అవార్డ్ తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తుంటాడు. తను అవార్డ్ ఎందుకు తెచ్చుకోవాలనుకుంటాడనే థీమ్ తీసుకొని, సాఫ్ట్ వేర్ జాబ్ సెర్చింగ్ లోని కష్టాలు, అలాగే ప్రస్తుతం సాఫ్ట్ వేర్ జాబ్ చేస్తున్న వారి కష్టాలు ఎలా ఉంటాయి, వారికిచ్చిన టార్గెట్స్, టాస్క్స్ పూర్తి చేసే క్రమంలో వారు పడుతున్న టెన్షన్స్ ను తెలుపుతూ ఔట్ అండ్ ఔట్ కామెడీ ఎంటర్ టైనర్గా రూపొందించా' అని చెప్పారు. 'సినిమా చూసిన వారందరికీ కనెక్ట్ అవుతుంది' హీరో శ్రీరాం చెప్పారు.