Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సునీల్ హీరోగా వి.ఎన్.ఆదిత్య దర్శకత్వంలో రూపొందుతున్న వినోద భరిత చిత్రానికి 'మర్యాద క్రిష్ణయ్య' అనే టైటిల్ ఖరారు చేశారు. ఏటీవీ ఒరిజినల్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లపై కిశోర్ గరికపాటి, టీజీ విశ్వప్రసాద్, అర్చనా అగర్వాల్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. సునీల్ బర్త్‌డే సందర్భంగా చిత్ర బందం ఆదివారం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఈ పోస్టర్లో సునీల్ దేన్నో చూసి షాకవుతున్నట్లుగా పోజ్ ఇచ్చారు. ఆసక్తికరమైన టైటిల్, ఫ˜స్ట్ లుక్ పోస్టర్ ఈ సినిమాపై అంచనాలు పెంచింది. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి సాయికార్తీక్ సంగీతం సమకూరుస్తున్నారు. దాము నర్రావుల సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తుండగా, లక్ష్మీ భూపాల్ డైలాగ్స్ రాస్తున్నారు. హీరోయిన్‌తో పాటు ఇతర తారాగణం వివరాలు త్వరలోనే తెలియనున్నాయి. ఈ చిత్రానికి ఎడిటింగ్: వెంకట్ రెడ్డి, ఆర్ట్: యాదగిరి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, గణేష్.