Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సునీల్ చరణ్ హీరోగా, నందిత, శ్రీ వత్స, గూడుపు శ్రీను, జబర్దష్ నాగిరెడ్డి, సింహాద్రి ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం 'బీచ్ రోడ్'. రజిని జి.విజరుని దర్శకుడిగా పరిచయం చేస్తూ గొర్రెల రామకష్ణ, మోకా బాబీ విఎల్ఎన్, వి.ఆర్.కుమార్.డి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది.
ఈ సినిమా చిత్రీకరణ మార్చి 8 నుండి రాజమండ్రిలో మొదలవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ఫిల్మ్ ఛాంబర్లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, 'మార్చి 8 నుంచి సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేస్తాం. అంతా కొత్తవారితో రాజమండ్రి, వైజాగ్లో సినిమా చిత్రీకరణ చేస్తాం. లవ్, రొమాంటిక్, క్రైమ్ సినిమా ఇది' అని తెలిపారు. దర్శకుడు మాట్లాడుతూ, 'ఆద్యంతం సస్పెన్స్, క్రైమ్ కథతో సాగే సినిమా ఇది. నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతలకు ధన్యవాదాలు' అని చెప్పారు. హీరో సునీల్ మాట్లాడుతూ, 'మా స్టూడియోలో 10 సంవత్సరాల నుండి ఎన్నో సినిమాలకు వర్క్ చేశాను. అప్పటినుండే సినిమాల్లో నటించాలనే కోరిక ఉండేది. డైరెక్టర్ విజరు వినిపించిన కథ నన్నెంతో ఇంప్రెస్ చేసింది' అని తెలిపారు.