Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న భారతదేశపు మొట్టమొదటి మడ్ రేస్ చిత్రం 'మడ్డి'. భారీ బడ్జెట్‌తో తెలుగు, కన్నడ, హిందీ, తమిళ, మలయాళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంతో డాక్టర్ ప్రగభల్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. యువన్, రిధాన్ కష్ణ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. పీకే7 క్రియేషన్స్ బ్యానర్‌పై ప్రేమ కష్ణదాస్ నిర్మిస్తున్నారు. బురదలో సాగే రేసింగ్ నేపథ్యంలో సాహసోపేతమైన యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందుతున్న ఈ చిత్ర టీజర్ ఇప్పటికే 10మిలియన్లకు పైగా రియల్‌టైమ్ వ్యూస్ సాధించి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంది. ఈ సందర్భంగా సోమవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో చిత్ర దర్శకుడు డా. ప్రగభల్ మాట్లాడుతూ, 'ఒక యూనిక్ మూవీని ప్రేక్షకులకు అందించాలని ఐదేళ్లు కష్టపడి ఈ మూవీని తెరకెక్కించాం. ఆఫ్ రోడ్ మడ్ రేస్ అనేది భారతదేశంలో కొత్త కానెప్ట్ కాబట్టి ప్రీ ప్రొడక్షన్, మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్ ఈ మూడు స్టేజెస్‌లో చాలా కష్టపడాల్సి వచ్చింది. ఈ సినిమా కోసం రియల్ మడ్ రేసర్స్ బ్యాక్‌గ్రౌండ్ ప్లేయర్లుగా నటించారు. ఇది ప్రేక్షకులకు తప్పకుండా కొత్త అనుభూతినిస్తుంది. ఈ సినిమా ప్రధానంగా రెండు వేర్వేరు జట్ల మధ్య శత్రుత్వం, ప్రతీకారం ఉన్నప్పటికీ ఫ్యామిలీ డ్రామా, లవ్, కామెడీ, సాహసం ఇలా ప్రతి ఎమోషన్ ఉంటాయి. సౌండ్, విజువల్స్ ప్రధాన ఆకర్షనగా నిలుస్తాయి. ఈ చిత్రం ఎక్కువ భాగం తమిళనాడు, కేరళలోని హిల్ స్టేషన్స్‌లో చిత్రీకరించాం. సినిమాకి సంబంధించిన ప్రతి దశ నాకు సవాళ్ళు విసిరినప్పటికీ అందరి సహకారంతో అద్భుతమైన సినిమాని ప్రేక్షకులకు అందిస్తున్నందుకు హ్యాపీగా ఉంది' అని చెప్పారు.