Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా డెన్నిస్ జీవన్ కానుకొలను దర్శకత్వంలో నటిస్తున్న చిత్రం 'ఎ1 ఎక్స్‌ప్రెస్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లుపై టి.జి. విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. ఈ చిత్ర ప్రీ రిలీజ్ వేడుక ఆదివారం హైదరాబాద్‌లో వైభవంగా జరిగింది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ లాక్డౌన్ టైౖంలో సోషల్ షార్ట్ ఫిల్మ్ కాంటెస్ట్ నిర్వహించింది. ఈ కాంటెస్ట్‌లో విజేతలుగా ఎంపికైన ముగ్గురికి లక్షరూపాయల ప్రైజ్ మనీని అందించారు. ఇదే వేదికపై స్టార్ జిని యాప్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిధి రామ్ మాట్లాడుతూ,'ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే పెద్ద సినిమా రేంజ్లో కనిపిస్తుంది. ప్రతి యాక్టర్‌కి ఒక పెద్ద హిట్ సినిమా అనేది వస్తుంది. సందీప్ కెరీర్లో ఈ చిత్రం బ్లాక్‌బస్టర్ సక్సెస్ అవుతుంది' అని చెప్పారు. హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ, 'ఈ సినిమాని కేవలం 40 రోజుల్లోనే తీశాం. దానికి మా నిర్మాతలే కారణం. ఈ సినిమాతో 14 మంది కొత్త టెక్నీషియన్స్ ఇంట్రడ్యూస్ అవుతున్నారు. డెన్నీస్ వైజాగ్ నుండి వచ్చి ఒక షార్ట్ ఫిలిం తీసి చూపించాడు. అతన్ని నమ్మి ఈ సినిమా ఇచ్చాం. చాలా మంచి అవుట్‌ఫుట్ వచ్చింది. హిప్ఆప్ ఈ సినిమాకి హీరో. సుమ చివరలో కామెంటరీ చెప్పింది' అని అన్నారు. నా మనసుకి నచ్చిన సినిమా ఇది అని కథానాయిక లావణ్య త్రిపాఠి అన్నారు. దర్శకుడు డెన్నిస్ జీవన్ కానుకొలను మాట్లాడుతూ.'నేషనల్ స్పోర్ట్స్ మూవీని డైరెక్ట్ చేసే అవకాశం ఇచ్చిన సందీప్ కిషన్‌కి, మా నిర్మాతలకి ధన్యవాదాలు' అని అన్నారు.