Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సందీప్ కిషన్, లావణ్య త్రిపాఠి జంటగా డెన్నిస్ జీవన్ కనుకొలను దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'ఎ1 ఎక్స్‌ప్రెస్'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వెంకటాద్రి టాకీస్, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్లుపై టి.జి విశ్వప్రసాద్, అభిషేక్ అగర్వాల్, సందీప్ కిషన్, దయా పన్నెం సంయుక్తంగా నిర్మించిన చిత్రమిది. ఈ చిత్రం నేడు (శుక్రవారం) అత్యధిక థియేటర్స్‌లో గ్రాండ్‌గా విడుదలవుతోంది. ఈ సందర్బంగా చిత్ర బృందం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో చిత్ర దర్శకుడు మాట్లాడుతూ, 'ఒక గేమ్ ఆడేటప్పుడు వాళ్లలో టాలెంట్ ఉన్న వారిని ఎంకరేజ్ చేయాలి తప్పితే.. డబ్బు ఉన్నోడిని కాదు అనే విషయాన్ని ఈ చిత్రంలో చూపించాం' అని తెలిపారు.
హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ, 'ఇది నా ఇరవై ఐదవ చిత్రం. చాలా స్పెషల్ సినిమా. ఇలాంటి కథని నమ్మి తీసిన మాతోటి నిర్మాతలకు కతజ్ఞతలు. హాకీ స్పోర్ట్స్ నేపథ్యంలో సాగే మాసివ్ ఎంటర్టైనర్ ఇది. పేట్రియాటిజం ఉండే హాకీ గేమ్‌ని ఇండియన్స్ అందరూ బాగా చూస్తారు. అలాంటి ఒక కొత్త కాన్సెప్ట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా చేయడం నా అదష్టం. సినిమా చాలా బాగా వచ్చింది. అవుట్‌పుట్ చూసుకున్నాక టీమ్ అందరి కళ్ళలో నీళ్లు తిరిగాయి. మేమంతా సంతృప్తిగా ఉన్నాం. వరంగల్‌లో ఉండే రాకేష్ కొంత మందికి హాకీ ట్రైనింగ్ ఇస్తున్నాడు. వాళ్లకి సరైన సదుపాయాలు లేవు. మా వంతు వాళ్లందరికీ ఆర్థిక సహాయం చేస్తాం. అలాగే ఈ చిత్రం ద్వారా నాకు వచ్చే లాభాల్లో పిల్లల చదువులకు కొంత వినియోగిస్తాను' అని తెలిపారు.