Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం 'వకీల్ సాబ్'. శ్రీరామ్ వేణు దర్శకత్వంలో ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించారు. ఈనెల 9న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా బుధవారం దిల్ రాజు మీడియాతో మాట్లాడుతూ, 'పవర్‌స్టార్‌తో సినిమా చేయాలన్న నా కల ఈ సినిమాతో నెరవేరింది. ఒక మ్యాజిక్ జరగబోతోందని ఈ సినిమా బుకింగ్స్ చూస్తే తెలుస్తోంది. 'పింక్' కథను ఏమాత్రం డిస్ట్రబ్ చేయకుండా హీరో ఇమేజ్‌కి తగినట్లు ఈ సినిమా ఉంటుంది. పవన్ ఇమేజ్‌కు తగినట్లు శ్రీరామ్ వేణు కథనంపై బాగా కసరత్తు చేశాడు. ఈ సినిమా 15వ నిమిషంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీ ఉంటుంది. అక్కడి నుంచి కథ ప్రకారం ఆయన వస్తూ ఉంటాడు. ఇది చాలా జాగ్రత్తగా చేయాల్సిన సినిమా. కత్తి మీద సాములాంటి ప్రాజెక్ట్ ఇది. దర్శకుడు చాలా బాగా చేశారు. పవర్‌స్టార్‌తో ఈ సినిమా అనుకున్నప్పుడే సాంగ్స్, ఫైట్స్, ఆయన క్యారెక్టర్ని డిజైన్ చేశాం. సినిమా చూశాక చాలా మంది తెలిసిన కథే అయినా, కొత్తగా ఉందని ఫీలవుతారు. దర్శకుడు శ్రీరామ్ వేణు వందకు వంద శాతం న్యాయం చేశాడు. డబుల్ పాజిటివ్ చూసి హిట్ సినిమా. ఏ రేంజ్‌కు వెళ్తుందో చూడాలనుకున్నా. శంకర్, రామ్‌చరణ్ సినిమా జూలైలో స్టార్ట్ అవుతుంది. 'థాంక్యూ' సినిమా ఫైనల్ షెడ్యూల్ జరుగుతోంది. వీటితోపాటు 'రౌడీ బాయ్స్', 'పాగల్', 'ఎఫ్ 3' సినిమాలు ప్రొడక్షన్లో ఉన్నాయి. బాలీవుడ్లో 'జెర్సీ', 'హిట్' సినిమాల్ని రీమేక్ చేస్తున్నాం. సల్మాన్ సోదరుడితో మరో రీమేక్ ఉంటుంది. త్వరలో అల్లు అర్జున్‌తో శ్రీరామ్ వేణు చేయబోయే సినిమా స్టార్ట్ అవుతుంది' అని చెప్పారు.