Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ కార్తికేయ, హిమాన్సీ, శుభాంగి పంత్ హీరో హీరోయిన్లుగా రూపొందుతున్న చిత్రం 'ఇట్లు అంజలి'. శ్రీకష్ణ వొట్టూరు సమర్పణలో ఓమా ప్రొడక్షన్స్ పతాకంపై నవీన్ మన్నేల స్వీయ దర్శకత్వంలో ఈ రొమాంటిక్ క్రైమ్ థ్రిల్లర్ తెరకెక్కింది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఈ సందర్భంగా దర్శక,నిర్మాత నవీన్ మన్నేల మాట్లాడుతూ,'ప్రేమలేఖ ఆధారంగా సాగే డిఫరెంట్ రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ చిత్రమిది. ఇప్పటి వరకు వచ్చిన థ్రిల్లర్స్ సినిమాల్లో కన్నా చాలా విభిన్నంగా ఉంటుంది. టీమ్ అంతా కష్టపడి సినిమా చేశాం. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కుతుందన్న నమ్మకంతో ఉన్నాం. ఇందులో చాలా రిస్కీ షాట్స్ ఉన్నాయి. అలాగే మంచి కంటెంట్ ఉంది. మంచి కంటెంట్ ఉంటే ఏ సినిమానైనా ప్రేక్షకులు ఆదరిస్తారని ఇప్పటికే ఎన్నో సార్లు నిరూపితమైంది. అదే కోవలో ఈ సినిమా కూడా అన్ని వర్గాల ప్రేక్షకులకు మెచ్చే సినిమా అవుతుంది. అన్ని కార్యక్రమాలు పూర్తయినఈ చిత్రాన్ని చాలా గ్రాండ్గా ఈనెల 16న రిలీజ్ చేస్తున్నాం' అని చెప్పారు.
కాదంబరి కిరణ్, అనంత్, 'ఈ రోజుల్లో' వెంకీ, జబర్దస్త్ అవినాష్, నారి తనకల, ఆర్తి నాగవంశం, సాహితి, స్వరూప, ధనుష్, సంజరు, నవీన్ కుమార్, అర్జున్, మహేంద్ర నాథ్, సునీత మనోహర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: కార్తిక్ కొడకండ్ల, సినిమాటోగ్రఫీ: వి.కె.రామరాజు, ఎడిటింగ్ : మార్తాండ కె వెంకటేష్, కథ-స్క్రీన్ ప్లే- డైలాగ్స్-నిర్మాత - దర్శకత్వం : నవీన్ మన్నేల.