Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగశౌర్య హీరోగా స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో రూపొందిన చిత్రం 'లక్ష్య'. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఈనెల 10న విడుదల కానుంది. తాజాగా హీరో నాగచైతన్య 'సయ సయ' అంటూ సాగే లిరికల్ వీడియోను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'ఈ పాటలో నాగశౌర్య, కేతిక శర్మ ఎంతో అందంగా కనిపిస్తున్నారు. వీళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది. కష్ణ కాంత్ మంచి సాహిత్యాన్ని అందించగా, కాల భైరవ ఇచ్చిన క్యాచీ మెలోడి ట్యూన్ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఇక జునైద్ కుమార్ గాత్రం శ్రావ్యంగా ఉంది. ఇటీవల వెంకటేష్‌గారు రిలీజ్ చేసిన ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి. జగపతి బాబు, సచిన్ ఖేడేకర్ పాత్రలు ఈ సినిమాలో చాలా కీలకంగా ఉంటాయి' అని పేర్కొంది.