Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గణేష్ బెల్లంకొండ హీరోగా సితార ఎంటర్ టైన్మెంట్స్బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం 'స్వాతిముత్యం'. వర్ష బొల్లమ్మ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం ద్వారా లక్ష్మణ్.కె.కష్ణ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సంక్రాంతి పండగని పురస్కరించుకుని ఈ చిత్ర ఫస్ట్ గ్లింప్స్‌ని చిత్ర బృందం రిలీజ్ చేసింది.
'గ్లింప్స్‌లోని సన్నివేశాలు, సంభాషణలను పరిశీలిస్తే, వినోదమే ప్రధానంగా ఈ చిత్రం రూపొందుతోందని వేరే చెప్పక్కర్లేదు. దర్శకుడి మాటల్లో చెప్పాలంటే 'స్వాతిముత్యం' లాంటి ఓ యువకుడు కథే ఈ చిత్రం. జీవితం, ప్రేమ, పెళ్లి పట్ల ఆలోచనలు, అభిప్రాయాల నేపథ్యంలో అతని జీవిత ప్రయాణం ఎలా సాగిందన్నది ఈ చిత్రం. కుటుంబ సంబంధాలు, భావోద్వేగాలతోపాటు వినోదాన్ని పుష్కలంగా పంచుతాయి' అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమా చిత్రీకరణ త్వరలోనే పూర్తి కానుందని నిర్మాత సూర్య దేవర నాగవంశీ తెలిపారు. ఈ చిత్రానికి సమర్పణ: పి.డి.వి. ప్రసాద్.