Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'కాలింగ్ బెల్', 'రాక్షసి' చిత్రాలతో డైరెక్టర్‌గా తనకంటూ ఓ ప్రత్యేకత సొంతం చేసుకున్నారు పన్నా రాయల్. ఆయన దర్శకత్వంలో రూపొందిన మరో డిఫరెంట్ చిత్రం 'ఇంటి నెం.13'. ఇటీవల విడుదలైన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ లభించడం ఓ విశేషమైతే, సంక్రాంతి పండగ సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ 24 గంటల్లోనే ఒక మిలియన్ వ్యూస్‌ని క్రాస్ చేసి సోషల్ మీడియాలో హల్చల్ చేయటం మరో విశేషమని చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేసింది. రీగల్ ఫిలిం ప్రొడక్షన్స్ పతాకంపై హేసన్ పాషా ఈ చిత్రాన్ని నిర్మించారు.
టీజర్‌కి వస్తున్న రెస్పాన్స్ గురించి దర్శకుడు పన్నా రాయల్ మాట్లాడుతూ,'ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించాలన్న లక్ష్యంతో రూపొందించిన సినిమా ఇది. మిస్టీరియస్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా అందర్నీ అలరిస్తుంది. టీజర్ రిలీజైన తర్వాత వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. కంటెంట్ పరంగానే కాకుండా టెక్నికల్‌గా కూడా ఈ సినిమా చాలా హై రేంజ్లో ఉంటుంది. ఆడియన్స్‌కి ఓ హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీలింగ్ కలుగుతుంది' అని అన్నారు.
'మేం ఊహించిన దానికంటే టీజర్‌కి ఎక్కువ రెస్పాన్స్ వస్తోంది. మా బ్యానర్ నుంచి ఓ డిఫరెంట్ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేస్తున్నాం. ట్రైలర్ రిలీజ్‌తో ఈ సినిమాపై ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్ మరింత పెరుగుతాయన్న నమ్మకం ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమా విడుదల తేదీని ప్రకటిస్తాం' అని నిర్మాత హేసన్ పాషా తెలిపారు.
నవీద్‌బాబు, శివాంగి మెహ్రా, ఇర్ఫాన్, నికీషా, ఆనంద్‌రాజ్, తనికెళ్ళ భరణి, పథ్విరాజ్, నెల్లూరు సుదర్శన్, శివన్నారాయణ, సత్యకష్ణ, విజయ రంగరాజు తదితరులు నటించిన ఈ సినిమాకు సంగీతం: వినోద్ యాజమాన్య, సినిమాటోగ్రఫీ: పి.ఎస్.మణికర్ణన్, ఎడిటింగ్: ఎస్.కె.చలం, కొరియోగ్రఫీ: కె.శ్రీనివాస్, మాటలు: వెంకట్ బాలగోని, పాటలు: రాంబాబు గోశాల, నిర్మాత: హేసన్ పాషా, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: పన్నా రాయల్.