Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో రూపొందిన చిత్రం 'గుడ్ లక్ సఖి'. ఆది పినిశెట్టి, జగపతి బాబు కీలక పాత్రలు పోషించారు. సహ నిర్మాత శ్రావ్య వర్మ నేతత్వంలో ఎక్కువ మంది మహిళా టెక్నీషియన్స్‌తో రూపొందింది. క్రీడా నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేష్ షూటర్‌గా ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేయబోతున్నారు. నగేష్ కుకునూర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా విడుదలకు సిద్ధమైంది.
ఈ సందర్భంగా ఈ సినిమా రిలీజ్ గురించి చిత్ర బృందం మాట్లాడుతూ, 'రిపబ్లిక్ డే తర్వాత రెండు రోజులకు అంటే ఈనెల 28న ఈ చిత్రాన్ని మేకర్స్ రిలీజ్ చేస్తున్నారు. సినిమా విడుదలకు వారం రోజులే ఉండటంతో ప్రమోషన్స్‌ను వేగవంతంగా, వినూత్నంగా చేయబోతున్నారు. నగేష్ కుకునూర్ మేకింగ్ స్టయిల్, దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం, చిరంతాన్ దాస్ సినిమాటోగ్రఫీ సినిమాకి ప్రధాన ఆకర్షణలుగా నిలవనున్నాయి. ఇక ఓ సాధారణ గ్రామీణ యువతి షూటర్‌గా ఎందుకు మారింది?, ఆమె సాధించిన ఘనత ఏంటి? అనే విషయాల సమాహారంగా ఆద్యంతం ఆసక్తికరంగా ఈ సినిమా ఉండనుంది. ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్, పోస్టర్లు అన్నీ కూడా విశేషమైన ఆదరణను సొంతం చేసుకున్నాయి. దీంతో సినిమాపై సర్వత్రా భారీ అంచనాలు పెరిగాయి' అని చెప్పారు.