Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎట్టకేలకు రామ్‌చరణ్ సరసన నటించే లక్కీ ఛాన్స్‌ను సమంత కొట్టేసింది. గతంలో రెండు సార్లు ఈ కాంబినేషన్లో సినిమాలు రావాల్సి ఉంది. కారణాలు ఏవైనప్పటికీ ఈ కాంబినేషన్లో త్వరలోనే ఓ భారీ రీమేక్ చిత్రం సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఇటీవల తమిళంలో విడుదలై సంచలన విజయం సాధించిన 'తని ఒరువన్' చిత్రాన్ని తెలుగులో రామ్‌చరణ్ హీరోగా నిర్మాతలు దానయ్య డి.వి.వి., ఎన్.వి.ప్రసాద్ సంయుక్తంగా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో రామ్‌చరణ్‌కి జోడీగా సమంతని ఎంపిక చేసినట్టు సమాచారం. 'ఎవడు', 'బ్రూస్లీ' చిత్రాల్లో కూడా రామ్‌చరణ్ సరసన సమంతనే నటించాల్సి ఉంది. డేట్స్ ప్రాబ్లెమ్స్ వల్ల సమంత నటించలేకపోయింది. తాజాగా ఈ ప్రాజెక్ట్‌కి సైతం డేట్స్ ప్రాబ్లెమ్ ఉన్నప్పటికీ రామ్‌చరణ్‌తో కలిసి నటించేందుకు సమంత సముఖంగా ఉండటంతో ఇతర ప్రాజెక్ట్స్‌కి డేట్స్‌ని సర్దుబాటు చేసిందట. దీంతో రామ్‌చరణ్ సరసన సమంత నటిస్తుందనే వార్త దాదాపు ఖరారైంది. ఈ ప్రాజెక్ట్‌తోపాటు ప్రస్తుతం మహేష్ సరసన 'బ్రహ్మోత్సవం', నితిన్‌తో 'అ ఆ' చిత్రాల్లో నటిస్తూ సమంత బిజీగా ఉంది.