Authorization
Mon Jan 19, 2015 06:51 pm
2013లో పాకిస్తాన్‌లోని లాహోర్ జైలులో మృతిచెందిన సరబ్బీజ్ సింగ్ జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ దర్శకుడు ఒమంగ్ కుమార్ 'సరబ్జీత్' చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సరబ్జీత్ పాత్రల్లో రణ్‌దీప్ హుడా నటిస్తుండగా, అతని చెల్లెలు దల్బీర్ కౌర్ పాత్రలో బాలీవుడ్ బ్యూటీ ఐశ్వర్యరారు బచ్చన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. కాగా, సరబ్జీత్ భార్యగా రిచా చద్దాను తాజాగా ఎంపిక చేశారు. ఈ సందర్బంగా మీడియాతో రిచా మాట్లాడుతూ, 'సరబ్జీత్ భార్య పాత్ర కోసం చిత్రయూనిట్ నన్ను సంప్రాదించారు. స్క్రిప్ట్ నాకు బాగా నచ్చింది. అందుకే ఈ చిత్రంలో నటిం చేందుకు అంగీకరించాను' అని చెప్పింది. దీంతోపాటు రిచా ప్రస్తుతం 'మై ఔర్ ఛార్లెస్', 'ఔర్ దేవదాస్', 'క్యాబరే' వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.