Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బీయింగ్ సల్మాన్'ఈనెల 27న సల్మాన్‌ఖాన్ 50వ పుట్టినరోజుని పురస్కరించుకుని సల్మాన్‌ఖాన్ జీవిత చరిత్రపై రచయిత జాసిమ్ఖాన్ రాసిన 'బీయింగ్ సల్మాన్' పుస్తకాన్ని విడుదల చేయనున్నారు. ఈ పుస్తకంలో సల్మాన్ సినీ జీవితం, సినిమాలు హిట్లు, ఫట్లు..కుటుంబంతో ఆయనుకున్న అనుబంధం, సల్మాన్ మీద వచ్చిన విమర్శలు, కేసులు వంటి విషయాలను కూడా పొందుపరిచానని, సల్మాన్ 50వ బర్త్‌డే కానుకగా ఈ పుస్తకాన్ని విడుదల చేయడం ఆనందంగా ఉందని రచయిత జాసిమ్ఖాన్ తెలిపారు. సల్మాన్ ఇటీవల నటించిన 'ప్రేమ్ రతన్ ధన్ పాయో' చిత్రం ప్రపంచ వ్యాప్తంగా 400 కోట్ల రూపాయల్ని కలెక్ట్‌చేసి విజయవంతంగా ప్రదర్శితమవుతోంది.