Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రేక్షకుల్లో మంచి గుర్తింపుతో పాటు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎదిగే స్థాయికి రావడం కన్నా ఓ నటికి ఇంకేం కావాల'ని అంటోంది తాప్సీ. 'గంగ'గా ప్రేక్షకుల్ని భయపెట్టి విజయం సాధించిన తర్వాత తాప్సీకి అటు కోలీవుడ్లోను, ఇటు బాలీవుడ్‌లోను అవకాశాల మీద అవకాశాలొస్తున్నాయి. దీంతోపాటు బహుళ జనాదరణ పొందిన జపాన్ కంపెనీ హోండాకి తొలి మహిళా బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. ఈ నేపథ్యంలో స్పందిస్తూ, 'హై ఇమేజ్ వ్యాల్యూ ఉన్న హోండా కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండటమనేది ఓ విజయంగా భావిస్తున్నాను. నా జీవితంలో నేను ఏదైనా సాధించానంటే అది ఇదేనని గర్వంగా చెప్పగలను. చెల్లెలు షాగన్ పొన్నుతో కలిసి ఇటీవల ప్రారంభించిన వెడ్డింగ్ ప్లానర్ బిజినెస్ కూడా అందరి ప్రోత్సాహంతో బాగా రన్ అవుతోంది. కెరీర్లో ఎన్నో విజయాల్ని సాధించడానికి ఇవన్నీ నాకెంతో ఉపయోగపడతాయి' అని తాప్సీ సంతోషాన్ని వ్యక్తం చేసింది.