Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్లో అడల్డ్ కామెడీ చిత్రంగా సంచలనం సృష్టించిన 'గ్రాండ్ మస్తీ' చిత్రానికి సీక్వెల్గా రాబోతున్న 'గ్రాండ్ మస్తీ3'లో ముగ్గురు హీరోల సరసన ఒకే హీరోయిన్ నటిస్తోంది. ఆ హీరోయిన్గా ఊర్వసి రౌతాలాను ఎంపిక చేసినట్టు సమాచారం. 2004లో రూపొందిన 'మస్తీ'కి సీక్వెల్గా 'గ్రాండ్ మస్తీ' రూపొందింది. 'గ్రాండ్ మస్తీ 3'లోనూ రితేష్ దేశ్ముఖ్, వివేక్ ఒబెరారు, అఫ్టాబ్ శివసాని హీరోలుగా నటించ నున్నారు. ఈ చిత్రానికి కూడా ఇంద్రకుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.