Authorization
Mon Jan 19, 2015 06:51 pm
మహేష్‌బాబు, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్.సినిమా ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్వీప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం 'స్పైడర్'. శనివారం చెన్నైలో ఆడియో విడుదలవ్వడంతో ఈ చిత్ర పాటల సందడి షురూ అయ్యింది. ఇప్పటికే రెండు పాటలను చిత్రయూనిట్ విడుదల చేసిన విషయం తెలిసిందే. తాజాగా 'సిసిలియా.. సిసిలియా..' అంటూ సాగే పల్లవిగల సాంగ్ వీడియో క్లిప్‌ను కథానాయిక రకుల్ ప్రీత్‌సింగ్ ట్వీట్టర్ ద్వారా అభిమానులతో పంచుకుంది. దీంతో 'స్పైడర్' చిత్ర గీతాల సందడి మరింత ఊపందుకుంది. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈచిత్ర ప్రీ రిలీజ్ వేడుకను ఈనెల 15న హైదరబాద్‌లో అత్యంత వైభవంగా జరుపుతున్నట్టు చిత్ర నిర్మాతలు తెలియజేసిన విషయం విదితమే. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం ఏకధాటిగా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని దసరా కానుకగా ఈనెల 27న విడుదల చేయనున్నారు.