Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'ప్రేమించిన అమ్మాయిని దక్కించు కోవడం కోసం కమ్యూనిస్టు భావాలున్న హీరోయిన్ తండ్రిని క్యాపిటల్ భావాలున్న హీరో ఎలా ఒప్పించాడనేది తెలియాలంటే 'ఉంగరాల రాంబాబు'
సినిమా చూడాల్సిందే' అని అంటోంది మియా జార్జ్. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో సునీల్, మియా జార్జ్ జంటగా రూపొందిన చిత్రం 'ఉంగరాల రాంబాబు'. ఈ నెల 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మియా జార్జ్ మంగళవారం మీడియాతో ముచ్చటించింది. ఆ విశేషాలు ఆమె మాటల్లోనే..
టు షేడ్స్ ఉన్న క్యారెక్టర్..
ఇందులో నేను సావిత్రి అనే అమ్మాయిగా అలరిస్తాను. పనిచేస్తున్న కంపెనీలో హీరోతో పరిచయం ఏర్పడుతుంది. అది ప్రేమగా మారుతుంది. నా కోసం హీరో మా విలేజ్‌కి వస్తాడు. మా నాన్న కమ్యూనిస్టు భావాలున్న వ్యక్తి. మరి క్యాపిటల్ లక్షణాలున్న హీరో, మా నాన్నను ఎలా కన్వీన్స్ చేశాడు, ఈ క్రమంలో చోటు చేసుకున్న ఆసక్తికర, భావోద్వేగ సన్నివేశాల సమాహారమే ఈ చిత్రం.
నా పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయి. ఫస్టాఫ్‌లో మోడ్రన్ అమ్మాయిగా, సెకండాఫ్‌లో సాంప్రదాయ కుటుంబానికి చెందిన అమ్మాయిగా, చాలా పద్ధతిగా కనిపిస్తాను. పాత్రల్లోని వేరియేషన్ ఆకట్టుకుంటుంది.
నైస్ ఎక్స్పీరియన్స్..
నేను తెలుగులో నటిస్తున్న తొలి స్ట్రయిట్ చిత్రమిది. దీన్నొక పెద్ద ప్రాజెక్ట్‌గా భావిస్తున్నా. ఇక్కడందరూ బాగా చూసుకుంటారు. దర్శకుడు క్రాంతి మాధవ్ స్క్రిప్ట్ నెరేట్ చేయగానే ఓకే చెప్పేశా. ఎందుకంటే ఇందులో కామెడీతోపాటు ఎమోషన్స్, సెంటిమెంట్, సోషల్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి.
నా పాత్రకు ప్రయారిటీ కూడా ఉంది. అందుకే వెంటనే ఓకే చేశా. తెలుగు మాట్లాడటం కష్టంగా అనిపించింది. బాగా బైహార్డ్ చేసి డైలాగ్స చెప్పాల్సి వచ్చేది.
ఫుల్ సపోర్ట్..
ఈ చిత్రంలో సునీల్‌తో కలిసి పనిచేయడం సంతోషంగా ఉంది. డైలాగులు పలికే విషయంలో ఆయనెంతగానో సపోర్ట్ చేశారు. సెట్లో ఫన్నీగా ఉంటూ కామెడీని పంచే సునీల్ తెరవెనుక మాత్రం మంచి మానవత్వం ఉన్న మంచి వ్యక్తి.
అంతేకాదు నాకు హెల్త్ టిప్స్, డైట్ టిప్స్ కూడా ఇచ్చారు. సునీల్ చాలా బాగా డాన్స్ చేస్తారు. ఆయనతో డాన్స్ చేయడం కష్టమైనా నా లెవల్ బెస్ట్ చేశాను. ఇందులో ప్రకాష్ రాజ్ నాకు తండ్రిగా నటించారు. అంతటి లెజెండరీ నటుడితో పనిచేయడం చాలా సంతోషంగా ఉంది.
పాత్రకు ప్రయారిటీ..
నేను ఏ సినిమా చేసినా పాత్రకు ప్రయారిటీ ఉండాలి. మంచి భావోద్వేగాలతో కూడినదై, ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉండాలి. పాటల్లో అలా వచ్చి ఇలా పోయే పాత్రలు చేయను. ప్రస్తుతం మలయాళంలో మమ్ముట్టి నటిస్తున్న చిత్రంలో సిస్టర్‌గా నటిస్తున్నాను. నెక్ట్స్ తెలుగులో నటించే సినిమాల గురించి ప్రస్తుతం చర్చలు జరుగు తున్నాయి.