Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రాహుల్ రవీంద్రన్, చాందినీ చౌదరీ, మనాలీ రాథోడ్ హీరో, హీరోయిన్లుగా రేవన్ యాదు దర్శకత్వంలో ఈ.ఎం.వి.ఈ స్టూడియోస్ ప్రై.లిమిటెడ్ పతాకంపై రూపొందుతున్న చిత్రం 'హౌరా బ్రిడ్జ్'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి హీరో రాహుల్ రవీంద్రన్ మాట్లాడుతూ, 'ఈ చిత్రానికి 'హౌరా బ్రిడ్జ్' అనే టైటిల్ పెట్టడానికి కారణం ఏంటన్నది త్వరలోనే తెలియజేస్తాను. మానవ సంబంధాలకు, అనుబంధాలకు ఈ చిత్ర కథ ఓ వారధిగా ఉంటుంది. ఇందులో మరో బ్రిడ్జ్ కూడా ఉంటుంది. అదేంటనేది సస్పెన్స్. దర్శకుడు రేవన్ చాలా క్లారిటీతో ఉన్నారు. ఇందులోని అద్భుతమైన విజువల్స్ ప్రేక్షకులను వండర్ చేస్తాయి. నా కెరీర్లో అందరూ మెచ్చుకునే చిత్రమవుతుందని నమ్ముతున్నాను' అని అన్నారు. 'రాహుల్ మంచి నటుడు. బ్రిడ్జ్ నేపథ్యంలో సాగే ఆసక్తికరమైన కథాంశమిది. అందుకే ఈ టైటిల్‌ను పెట్టాం. సినిమా చాలా బాగా వచ్చింది. ఇటీవల విడుదలైన ఫస్ట్‌లుక్‌కు మంచి స్పందన లభించింది. షూటింగ్ పూర్తి చేసుకుని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటోంది. త్వరలోనే గ్రాండ్‌గా ఆడియో విడుదల చేస్తాం. సినిమా రిలీజ్ డేట్‌ను కూడా త్వరలోనే ప్రకటిస్తాం' అని దర్శకుడు రేవన్ తెలిపారు.