Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'పింక్' సినిమాతో బాలీవుడ్లో క్రేజీ కథానాయికగా మారిన తాప్సీకి అవకాశాలు అదే స్థాయిలో వస్తున్నాయి. నటనకు ప్రాధాన్యత ఉన్న చిత్రాలతోపాటు కమర్షియల్ చిత్రాలు ఆమెను వరిస్తున్నాయి. అందులో భాగంగా తాజాగా ఓ బంపర్ ఆఫర్ అందుకుంది తాప్సీ. బాలీవుడ్లో ఇటీవల క్రీడా నేపథ్య బయోపిక్‌ల హవా కొనసాగుతున్న నేపథ్యంలో ఓ బయోపిక్ తెరకెక్కబోతుంది. హాకీ ప్లేయర్ సందీప్ సింగ్ జీవిత స్ఫూర్తితో రూపొందబోతున్న చిత్రంలో హాకీ ప్లేయర్‌గా నటించే ఛాన్స్‌ను తాప్సీ అందిపుచ్చుకుంది. ఇందులో హాకీ ప్లేయర్ సందీప్ సింగ్‌గా పంజాబీ నటుడు దిల్జిత్ దోసాంజ్ నటించనున్నారు. ఆయనకు జోడీగా తాప్సీ మెరవనుంది. ఈ చిత్రం కోసం తాప్సీ, దిల్జిత్ ప్రస్తుతం శిక్షణ తీసుకుంటున్నారట. ఈ సినిమా త్వరలోనే సెట్స్‌పైకి వెళ్ళనున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తాప్సీ 'జుడ్వా 2', 'తడ్కా' చిత్రాల్లో నటిస్తోంది. ఈ నెల 29న 'జుడ్వా 2' విడుదల కానుంది.