Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ప్రస్తుతం హాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా త్వరలో బాలీవుడ్ చిత్రాల్లో నటించనుందనే వార్తలు ఇటీవల బాగా వినిపించాయి. ఇందులో ఏ ఒక్కటీ మెటీరియలైజ్ కాలేదు. బాలీవుడ్ సమాచారం మేరకు ఇప్పటికే ప్రియాంక రెండు కథలను ఫైనల్ చేసిందట. ప్రస్తుతం ఆమె నటిస్తున్న 'క్వాంటికో' సిరీస్‌తో పాటు రెండు హాలీవుడ్ చిత్రాలు పూర్తయ్యాక ఈ బాలీవుడ్ ప్రాజెక్టులుంటాయట. వచ్చే ఏడాది మార్చి తర్వాత ఈ సినిమాలు పట్టాలెక్కే ఛాన్స్ ఉందని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ చిత్రాల గురించి ప్రియాంక చెబుతూ, 'ఈ రెండు చిత్రాలు అమేజింగ్‌గా ఉంటాయి. ఈ టైమ్‌లో ఇండియా(బాలీవుడ్)లో సినిమాలు చేయడానికివి సరైన ప్రాజెక్టులుగా భావిస్తున్నా. అలాగే మరికొందరు ఫిల్మ్ మేకర్స్ గొప్ప ఐడియాస్తో నన్ను కలుస్తున్నారు. త్వరలో వాటిని ఫైనల్ చేస్తా. ప్రస్తుతం నటిస్తున్న హాలీవుడ్ చిత్రాలు కొత్తగా ఉంటాయి. ఇందులో నా పాత్రలకు చాలా ప్రయారిటీ ఉంటుంది. ఇండియన్ ప్రేక్షకులను కూడా అవి బాగా ఆకట్టుకుంటాయి' అని తెలిపింది. ప్రియాంక ప్రస్తుతం 'ఏ కిడ్ లైక్ జేక్', 'ఈజ్‌నాట్ ఇట్ రొమాంటిక్?' చిత్రాల్లో నటిస్తోంది.