Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శర్వానంద్, మెహరీన్ హీరోహీరోయిన్లుగా మారుతి దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మహానుభావుడు'. త్వరలో ఆడియో విడుదల కానున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ, 'అతి శుభ్రం పాటించే కుర్రాడు ప్రేమలో పడితే ఏం జరిగిందనే ఇతివృత్తంతో రూపొందిస్తున్న చిత్రమిది. ఇందులో శర్వానంద్, మెహరీన్ జోడీ ఆకట్టుకుంటుంది. ఇటలీ, ఆస్ట్రియా, క్రోయేషియా లాంటి విదేశాల్లో, పొల్లాచి, రామోజీ ఫిల్మ్‌సిటీ, హైదరాబాద్‌లోని పలు అందమైన లొకేషన్లలో చిత్రీకరణ జరిపాం. సినిమా విజువల్‌గా చాలా బాగా వచ్చింది. ఇటీవలే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం శరవేగంగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. సినిమా మ్యూజికల్ లవ్‌స్టోరీగా ఉంటుంది. ఈ చిత్రానికి థమన్ అద్భుతమైన బాణీలను అందించారు. ఆడియోను ఈ నెల 16న విడుదల చేయబోతున్నాం. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి విజయదశమి కానుకగా సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు. వెన్నెల కిషోర్, నాజర్, భద్రం, కళ్యాణి నటరాజ్, పిజ్జాబారు, భాను, హిమజ, వేణు, సుదర్శన్, సాయి, వెంకీ, శంకర్రావు, రామాదేవి, మధుమణి, రాగిణి, రజిత, అబ్బులు చౌదరి, సుభాష్, ఆర్.కె తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్: నిజార్ షఫి, ఆర్ట్: రవీందర్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు.