Authorization
Mon Jan 19, 2015 06:51 pm
స్పెషల్ సాంగ్స్‌లో అగ్ర కథానాయికలు మెరవడమనేది ప్రస్తుతం టాలీవుడ్‌లోనూ ఓ ట్రెండ్‌గా మారింది. కాజల్, తమన్నా వంటి తదితర స్టార్ హీరోయిన్లు ఇప్పటికే స్పెషల్ సాంగ్స్‌లో నటించి ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశారు. తాజాగా వీరి కోవలోకే మరో కథానాయిక రాశిఖన్నా రాబోతోంది.
రవితేజ సరసన 'రాజా ది గ్రేట్' చిత్రం కోసం ఓ స్పెషల్ సాంగ్‌లో నటించేందుకు రాశి గ్రీన్ సిగల్ ఇచ్చింది. అంతేకాదు ఇందులో ఓ అతిథి పాత్రలోనూ నటిస్తోందట. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో మెహరీన్ కథానాయిక. రాశి దీంతోపాటు 'టచ్ చేసి చూడు' చిత్రంలోనూ రవితేజకి జోడీగా నటిస్తోంది. అలాగే 'జై లవకుశ', 'సైతాన్ క బచ్చా', 'తొలి ప్రేమ', 'విలన్' వంటి తదితర చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.