Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'స్పైడర్' ప్రీ రిలీజ్ వేడుకలో మహేష్‌బాబు
'నేనొక సినిమాకు ఒప్పుకున్నానంటే దానికి ప్రాణం పెట్టి చేస్తాను. నాకు దర్శకుడు దేవుడితో సమానం' అని మహేష్ అన్నారు. ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో మహేష్‌బాబు, రకుల్ ప్రీత్ సింగ్ హీరో, హీరోయిన్లుగా ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్.సినిమా ఎల్ఎల్పి, రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ నిర్మించిన చిత్రం 'స్పైడర్'. ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఫంక్షన్ శుక్రవారం హైదరాబాద్‌లో జరిగింది.
అతిథిగా విచ్చేసిన కృష్ణ మాట్లాడుతూ, 'ఈ చిత్ర ట్రైలర్ అద్భుతంగా ఉంది. మహేష్ ప్రతి సినిమాలోనూ ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. తమిళ హీరోలా్లగ ఇందులో డైలాగ్స్ చెప్పాడు. మురుగదాస్ వంటి గొప్ప దర్శకుడు తెరకెక్కిస్తున్న చిత్రంతో మహేష్ తమిళ ప్రేక్షకులకు పరిచయం కావడం ఆనందంగా ఉంది. సినిమాలో అన్ని పాటలు బాగున్నాయి. అభిమానులు నన్ను మూడువందల యాభై సినిమాల్లో ఆదరించారు. ఇప్పుడు మహేష్‌నూ ఆదరిస్తున్నారు. ఈ చిత్రం కచ్చితంగా సూపర్ హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా చెబుతున్నాను' అని అన్నారు.
మహేష్‌బాబు మాట్లాడుతూ, 'మురుగదాస్‌ని పదేండ్ల క్రితం 'పోకిరి' టైమ్‌లో కలిశాను. ఆయనతో పనిచేయడానికి పదేండ్లు పట్టింది. మురుగదాస్ తీసే కథలు, స్క్రీన్‌ప్లే, సినిమాలకు నేను పెద్ద అభిమానిని. ఈ చిత్ర కథను నాకు గంటన్నర పాటు చెప్పారు. అద్భుతమైన సీన్స్, ఫైట్స్, యాక్షన్ ఎలిమెంట్స్‌తో ఎక్స్ట్రార్డినరీ థ్రిల్లర్ చేద్దామని, సినిమా చూసే ఆడియెన్స్ స్టన్ అయిపోవాలన్నారు. ఆడియెన్స్ ఏంటి? డబ్బింగ్ చెప్పేటప్పుడు నేనే స్టన్ అయిపోయా. సినిమాను బైలింగ్వల్ చేయడమంటే జోక్ కాదు. ఒక షాట్‌ను తెలుగులో ఐదారు సార్లు, తమిళంలో ఐదార్లు సార్లు చేయడం చాలా కష్టం. గ్రేట్ డైరెక్టర్స్ వల్లనే అది సాధ్యమవుతుంది. ఈ విషయంలో మురుగదాస్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఏడాదిన్నరగా ఆయనతో చేసిన జర్నీని మరిచిపోలేను. ఆయన యాటిట్యూడ్, సింప్లిసిటీ ఎప్పుడూ ఓకేలానే ఉంటాయి. 'స్పైడర్' లాంటి సినిమా తీయాలంటే గట్స్, ప్యాషన్ ఉండాలి.
మాపై నమ్మకం పెట్టిన నిర్మాతలకు థ్యాంక్స్. ఈ సినిమా కోసం ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డాం. చెన్నైలో చదువుకుంటున్నప్పుడు 'దళపతి', 'రోజా' సినిమాలు చూసి, పెద్దయ్యాక కెమెరామెన్ సంతోష్ శివన్‌తో సినిమాలు చేయాలనుకున్నాను. ఆయనతో ఈ చిత్రానికి పనిచేయడం ఆనందంగా ఉంది. ఎస్.జె.సూర్య దర్శకత్వంలో నటించాను. ఇప్పుడు ఈ చిత్రంలో కోస్టార్‌గా ఇద్దరం పనిచేశాం. క్లైమాక్స్ షెడ్యూల్ కష్టమైంది. నా కెరీర్లో ఇంత కష్టమైన క్లైమాక్స్ ఇదే. ఇన్టెన్స్ షెడ్యూల్ అది. అందులో చేసేటప్పుడు సూర్యగారి ఎనర్జీ అస్సలు తగ్గలేదు. హరీష్ జైరాజ్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. నాకు దర్శకుడు దేవుడితో సమానం. అది నమ్మినందుకే ఓ 'అతడు', ఒక 'పోకిరి', ఒక 'శ్రీమంతుడు' వంటి సినిమాలొచ్చాయి. అది నమ్మడం వల్లే ఇంత వాడినయ్యాను. ఇంత మంది అభిమానులు నాకున్నారు. ఇలాంటి అభిమానులు ఏ హీరోకు ఉండరు. సినిమాను నచ్చితేనే చూస్తారు. నచ్చకపోతే చూడరు. అభిమానులకు నచ్చే సినిమాలే చేస్తాను. ఈ నెల 27న సినిమా రిలీజ్ అవుతుంది. అన్నీ పండగల కన్నా ఈ పండుగకు పెద్దగా కొట్టబోతున్నామని అనుకుంటున్నాం. అభిమానుల ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నా' అని తెలిపారు.
'మహేష్‌గారి సినిమా 'ఒక్కడు'ని విజయవాడలో చూశా. అప్పట్నుంచి మహేష్‌ను కలిసినప్పుడల్లా 'నేను మీ అభిమానిని, మీతో సినిమా చేయాలనుంది' అని చెప్పాను. ఒక దర్శకుడుకి మంచి బలం అంటే హీరోనే. మహేష్ కమిట్మెంట్, డెడికేషన్ ఉన్న హీరో. ఈ సినిమా హిట్‌ను ఆయనకు డెడికేట్ చేస్తాను. ఈ సినిమా మహేష్‌బాబు గారిలా స్టయిల్‌గా, హ్యాండ్సమ్గా, డెడికేషన్‌గా వచ్చింది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది' అని మురుగదాస్ చెప్పారు. 'ఈ చిత్రం ఓ హాలీవుడ్ సినిమాలా ఉంటుంది. మహేష్ అభిమానులు హ్యాపీగా ఫీలవుతారు' అని ఎస్.జె.సూర్య తెలిపారు.
కొరటాల శివ చెబుతూ, 'ఇది ఇండియాలోనే ఫైనెస్ట్ సినిమా అవుతుంది. మహేష్ అభిమానులు మెచ్చే చిత్రమిది' అని అన్నారు.