Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎమ్మీ అవార్డ్ ఫంక్షన్లో గ్లోబల్‌స్టార్ ప్రియాంక చోప్రా వేసుకున్న డ్రెస్‌పై కామెంట్స్‌కు సోషల్ మీడియా వేదికైంది. ప్రతిష్టాత్మక ఎమ్మీ అవార్డు వేడుకల్లో పెద్ద చుక్కల డిజైన్‌తో ఉన్న తెలుపు రంగు దుస్తులతో ప్రియాంక రెడ్ కార్పెట్‌పై హల్చల్ చేశారు. 'ప్రియాంకను మించి రెడ్ కార్పెట్‌పై ఎవరూ అందంగా కనిపించడం లేదు', 'అది డ్రెస్సా.. లేక మెరిసిపోయే దుప్పటా..', 'స్వచ్ఛ భారత్, స్వచ్ఛతాహై సేవా కార్యక్రమాల ప్రచారకర్తలా ఉంది..', 'లాస్ ఏంజెల్లో ఓ మంచి చిరుత కనిపించడం లేదు..', 'ఇదేదో పెద్ద గద్దలా ఉందే..'' అంటూ ట్వీట్ల రూపంలో కామెంట్ల మీద కామెంట్లు చేసినప్పటికీ వాటిని ప్రియాంక సరదాగా తీసుకోవడం విశేషం.