Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సూరజ్, రవీంద్రతేజ, సానియా, స్నిగ్ద హీరో, హీరోయిన్లుగా జి.ఎల్.బి. శ్రీనివాస్ దర్శకత్వంలో ముళ్ళగూరు లక్ష్మీ దేవి సమర్పణలో అనంతలక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై ముళ్ళగూరు అనంతరాముడు, ముళ్ళగూరు రమేష్ నాయుడు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం '2 ఫ్రెండ్స్'. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి దర్శకుడు మాట్లాడుతూ, 'ప్రేమ గొప్పదా? లేక స్నేహం గొప్పదా అనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. నాలుగు షెడ్యూల్స్‌లో చిత్రీకరణ పూర్తి చేశాం.
బెంగుళూరు, అనంతపురం, వరంగల్ ప్రాంతాల్లో చిత్రీకరణ జరిపాం. తాజా షెడ్యూల్ చిత్రీకరణతో షూటింగ్ మొత్తం పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి. వచ్చే నెలలో పాటలను విడుదల చేస్తాం' అని అన్నారు. 'నేటి యువత ఎన్నో అద్భుతాలు సృష్టిస్తోంది. కాలేజీ రోజుల్లోనే యువతకు భవిష్యత్తు నిర్దేశకత్వం అవుతుంది. ప్రేమ కంటే స్నేహం గొప్పదనే కాన్సెప్‌తో ఈ చిత్రాన్ని రూపొందించాం. నిర్మాతలుగా మాకిది తొలి చిత్రం. కేవలం వినోదమే కాకుండా అంతర్లీనంగా యువతకు సందేశం ఇచ్చే విధంగా సినిమా ఉంటుంది' అని నిర్మాత తెలిపారు.