Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'మంచి కంటే చెడు చేయడానికి త్వరగా లోనవుతాం. 'జై లవకుశ'లో జై పాత్ర చేసేటప్పుడు నెగటివ్ యాటిట్యూడ్ తన్నుకుంటూ వచ్చింది. నాకు బాగా నచ్చిన పాత్ర కూడా 'జై'' అని అంటున్నారు ఎన్టీఆర్. బాబీ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై ఎన్టీఆర్ హీరోగా, రాశీఖన్నా, నివేదా థామస్ హీరోయిన్లుగా కళ్యాణ్‌రామ్ నిర్మించిన చిత్రం 'జై లవ కుశ'. ఈ నెల 21న ఈ చిత్రం విడుదల కానున్న నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో ఎన్టీఆర్‌తో మీడియా జరిపిన ఇంటర్వ్యూ విశేషాలు..ఈ సినిమా చేయడానికి మిమ్మల్ని ఎగ్జైట్ చేసిన అంశం?- కథే నన్ను ఎగ్జైట్ చేసింది. కథ విన్నాక నటనపై మరింత ఆశ మొదలైంది. 'జనతా గ్యారేజ్' తర్వాత ఏ సినిమా చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు బాబీ ఈ కథతో వచ్చారు. కథ విని ఎగ్జైట్ అయ్యాను. ఆ తర్వాత మూడు పాత్రలు చేయాలన్నప్పుడు ఇంకా ఎగ్జైట్ అయ్యాను. ప్రతి రోజూ టెక్నికల్‌గా మూడు పాత్రలు చేయడం కష్టంగా అనిపించేది. కానీ నటనకు మంచి స్కోప్ ఉంది. పాత్రలకు టెక్నాలజీని ఆపాదించి బాగా చేయగలిగాం.
సినిమా నేపథ్యం ఏమిటి?
- తనకు జన్మించిన ముగ్గురు కవల పిల్లలు మంచి వాళ్ళు కావాలని తల్లి కోరుకుంటుంది. కానీ వాళ్ళకి సరైన గైడెన్స్ లేకపోవడం వల్ల బయటి పరిస్థితులకు లోనై ఆ పిల్లలు ఇష్టానుసారం ప్రవర్తిస్తుంటారు. దీంతో ఆ తల్లి కల చెదిరిపోతుంది. దూరమైన ముగ్గురు ఎలా కలిశారనేది సినిమా. ఇదొక ఎమోషనల్ డ్రామా. తల్లిదండ్రులే పిల్లల్ని సరైన దారిలో పెట్టాలని చెప్పే చిత్రం. అలాగే ముగ్గురు అన్నదమ్ముల అనుబంధాన్ని తెలియజేస్తుంది. కళ్యాణ్‌రామ్ అన్న నిర్మాతగా, నేను హీరోగా ఇటువంటి అన్నదమ్ముల కథ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాని మా తల్లితండ్రులకు గిఫ్ట్‌గా భావిస్తున్నాం.
మూడు పాత్రల్లో మీకు బాగా నచ్చిన పాత్ర?
- మూడు పాత్రలు ప్రాధాన్యత కలిగి ఉంటాయి. అదే సందర్భంలో ఒక పాత్రకు మరో పాత్ర ఇంటర్ లింకై ఉంటుంది. మూడింటిలో ఏ ఒక్క పాత్ర లేకపోయినా సినిమా లేదు. పర్సనల్‌గా నాకు 'జై' పాత్ర బాగా నచ్చింది. దాని కోసం చాలా కష్టపడ్డాను. నెగటివ్ పాత్ర కావడంతో ఆ నెగటివ్ యాటిట్యూడ్ తన్నుకుంటూ వచ్చింది. పైగా తాతగారు నటించిన 'దాన వీర శూరకర్ణ' సినిమా తాలూకా ప్రభావం నాపై ఉండేది. దాన్ని ఊహించుకుని 'జై' పాత్ర చేశా. మూడు పాత్రలను ఓకేసారి చేయడం చాలా టఫ్ జాబ్. ఛాలెంజింగ్‌గా తీసుకుని చేశా. నటుడిగా ఆకలి ఉంటుంది. అది ఎప్పుడూ తీరదు. యాక్టర్‌గా మనం పరిణతి చెందాలి. అందుకు ఇలాంటి పాత్రలు ఎంతగానో ఉపయోగపడతాయి. జై పాత్ర నుంచి బయటపడడానికి చాలా టైమ్ పట్టింది. అందుకు 'బిగ్‌బాస్' బాగా హెల్ప్ అయ్యింది.
సినిమాపై నెలకొన్న భారీ అంచనాలపై మీ ఫీలింగ్?
- వరుస విజయాలు రావడంతో కచ్చితంగా తదుపరి విడుదలయ్యే సినిమాలపై అంచనాలుండటం, పెరగడం కామన్. మంచి కథలను జెన్యూన్ ఎఫర్ట్‌తో చేస్తే కచ్చితంగా అంచనాలను అధిగమిస్తామని భావిస్తున్నా. అభిమానులు నా నుంచి సినిమాలే కాకుండా ఇంకా ఏదో కోరుకుంటే.. ఇంకా ఏదైనా చేయాలనిపించినప్పుడు చేస్తా. ఇప్పుడు మాత్రం సినిమాలు, నా ఫ్యామిలీనే నా లైఫ్. మరే దాని గురించి ఆలోచించడం లేదు.
వక్కంతం వంశీతో సినిమా చేయకపోవడానికి రీజన్?
- వక్కంతం వంశీ, నేనూ మంచి స్నేహితులం. స్నేహానికి, సినిమాలకు సంబంధం లేదు. ఇద్దరం ఓ కథ అనుకున్నాం. కానీ దానిపై ఇద్దరికీ నమ్మకం కలగలేదు. అలా కాదని సినిమా చేసి, రిజల్ట్‌లో తేడా వస్తే అది మా స్నేహానికే మాయని మచ్చ కావచ్చు. అందుకే కొన్ని రోజులు వెయిట్ చేద్దామని చెప్పాను. నెక్ట్స్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా ఉంటుంది. ఆ సినిమా వివరాలు త్వరలోనే తెలియజేస్తాను.