Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చైతన్య, దివి ప్రసన్న హీరోహీరోయిన్లుగా మహేష్ దర్శకత్వంలో ఫిల్మ్స్ అండ్ సి పతాకంపై రూపొందుతున్న చిత్రం 'ప్రాజెక్ట్ సి 420'. ఈ చిత్రం మంగళవారం ఆస్ట్రేలియాలోని శ్రీ విష్ణు శివమందిల్(కాన్బెర్రా)లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా చిత్ర బృందం మాట్లాడుతూ, 'ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుందో లేదో తెలియదుగానీ, ఒక చిన్న తప్పు మాత్రం జీవితం దూల తీర్చేస్తుందనే కాన్సెప్ట్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. ఇండియన్స్, ఆస్ట్రేలియన్స్, ఇండోనేషియన్స్, పాకిస్తానీస్ తదితరులు నటిస్తున్న భారతీయ తెలుగు చిత్రమిది. దాదాపు 80శాతం ఆస్ట్రేలియన్ టెక్నిషన్స్ ఈ చిత్రం కోసం పనిచేయనున్నారు. మంగళవారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకునే ఈ చిత్రాన్ని అక్టోబర్ 30 వరకు చిత్రీకరణ పూర్తి చేయనున్నాం' అని అన్నారు.
ఈ చిత్రానికి మ్యూజిక్: మార్క్ కే రాబిన్, ఫొటోగ్రఫీ: సంతోష్ శనమొని.