Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'నేనొక నటిని. హీరోల ఆట బొమ్మను కాదు' అని అంటోంది అదితి రావు హైదరి. ఇటీవల 'వజీర్', 'ఫితూర్', 'చెలియా' వంటి తదితర చిత్రాల్లో భిన్న పాత్రలు పోషించి ప్రేక్షకులను విశేషంగా అలరించింది అదితి రావు హైదరి. అంతేకాదు ప్రస్తుతం మూడు భారీ చిత్రాల్లోనూ నటిస్తోంది. అయినప్పటికీ మరిన్ని అవకాశాలు ఆమెకు అందకుండా పోయాయి. అందుకు కారణాలేమిటో మీడియాతో అదితి మాట్లాడుతూ, 'నేను కూడా సెక్సిజమ్ బాధితురాలినే. హీరోలకు నేను నచ్చకపోవడం వల్ల పలు సినిమా ఛాన్స్‌లు కోల్పోయాను. నటిగా నేనేంటో నిరూపించుకున్నాను. నా ప్రతిభ గురించి అందరికీ తెలుసు. కానీ నాకు రావాల్సిన అవకాశాలు రావడం లేదు. దీనికి కారణం వారితో నేనెక్కువగా టైమ్ స్పెండ్ చేయకపోవడమే. హీరోల కింద అణిగిమణిగి, వారికి తొత్తుగా నేను ఉండాలనుకోవడం లేదు. నేనొక నటిని. వాళ్ళ ఆటబొమ్మను కాదు. లోపల ఒకలా, బయట మరోలా ఉండలేను. చిత్ర పరిశ్రమలో అమ్మాయిలను ఐటెమ్గానే పరిగణిస్తుంటారు. ఈ పద్ధతి మారాలి' అని ఘాటుగా స్పందించింది. ప్రస్తుతం 'ఔర్ దేవ్‌దాస్', 'భూమి', 'పద్మావతి'
చిత్రాల్లో అదితి నటిస్తోంది.