Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశాల్, అను ఇమ్మాన్యుయెల్, ఆండ్రియా హీరోహీరోయిన్లుగా మిస్కిన్ దర్శకత్వంలో తమిళంలో విడుదలైన 'తుప్పరివాలన్' చిత్రాన్ని విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీ సమర్పణలో జి.హరి తెలుగులో 'డిటెక్టివ్'గా అందిస్తున్నారు. ఈ చిత్రం గురించి నిర్మాత హరి మాట్లాడుతూ, 'సస్పెన్స్, యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమిది. ఈ వారం తమిళంలో విడుదలైన ఈ చిత్రం భారీ ఓపెనింగ్స్ సాధించింది. మొదటి వారంలో 30కోట్ల రూపాయలు కలెక్ట్ చేయనుంది. విశాల్ కెరీర్లోనే మొదటి వారం అత్యధిక కలెక్షన్లు సాధించిన చిత్రంగా రికార్డు సృష్టించింది. తెలుగు 'డిటెక్టివ్'కు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను మంగళవారం విడుదల చేశాం. ఈ చిత్రం తెలుగులో కూడా ఘన విజయం సాధిస్తుందన్న నమ్మకం ఉంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి అక్టోబర్‌లో సినిమాను విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నాం' అని అన్నారు. ప్రసన్న, కె.భాగ్యరాజ్, సిమ్రాన్, జాన్ విజరు, అభిషేక్ శంకర్, జయప్రకాష్ ఇతర ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: అరోల్ కొరెల్లి, సినిమాటోగ్రఫీ: కార్తీక్ వెంకట్రామన్.