Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బాహుబలి 2' తర్వాత తమన్నా మూడు భాషల్లో సినిమాలు చేస్తూ రాణిస్తోంది. తెలుగులో 'జైలవకుశ'లో స్పెషల్ సాంగ్‌లో మెరిసిన తమన్నా తమిళంలో విక్రమ్‌తో 'స్కెచ్' చిత్రంలో నటిస్తున్న విషయం విదితమే.ఇటీవలే ఈ ఇద్దరు కలిసి ఓ సాంగ్‌లో మెరిశారు. విజరు చందర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలోని ఓ సాంగ్‌ను ఇటీవల చెన్నైలో భారీ సెట్స్‌లో చిత్రీకరించారు. ఇందులో 150 మంది డాన్సర్లు, 1500మంది జూనియర్ ఆర్టిస్టులు పాల్గొనగా భారీ స్థాయిలో ఈ పాటను చిత్రీకరించాట. ఇందులో తమన్నా స్టెప్పులు అదిరిపోయేలా ఉంటాయట. ఉత్తర చెన్నై నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రంలో తమన్నా పాత్ర చాలా కీలకంగా, విభిన్నంగా ఉంటుందని తెలుస్తుంది. ఈ చిత్ర టీజర్‌ను త్వరలోనే విడుదల చేయను న్నారు. ఈ సినిమా డిసెంబర్లో విడుదల కానుంది. దీంతో పాటు తమన్నా హిందీలో 'ఖామోషి', తెలుగులో కూనల్ కోహ్లీ చిత్రంలో నటిస్తుంది.