Authorization
Mon Jan 19, 2015 06:51 pm
తెలుగు చిత్ర పరిశ్రమలో ఓ సెన్సేషన్ ప్రాజెక్ట్ సెట్ కాబోతుంది. పవన్‌కళ్యాణ్, ఎ.ఆర్.మురుగదాస్ వంటి డిఫరెంట్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం తెరకెక్కే అవకాశాలున్నట్టు తెలుస్తుంది. మురుగదాస్ రూపొందించిన 'స్పైడర్' చిత్ర షూటింగ్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ఆయన పవన్‌ను కలిశారట. ఆ విశేషాలను మురుగదాస్ చెబుతూ, 'ఇటీవల నేను పవన్ కళ్యాణ్‌ని కలిశాను. 'కత్తి' స్టోరీని పొడిగించమని పవన్ కోరారు. పవన్‌కి 'కత్తి' లాంటి సామాజిక నేపథ్యం ఉన్న కథలు బాగా సరిపోతాయి' అని చెప్పారు. అంటే 'కత్తి' చిత్రానికి సీక్వెల్‌గా వీరి కాంబినేషన్లో సినిమా వచ్చే ఛాన్స్ ఉందని సమాచారం. ఈ కాంబినేషన్ సెట్ అయితే ఇది సెన్సేషన్ ప్రాజెక్ట్ కావడం ఖాయం.