Authorization
Mon Jan 19, 2015 06:51 pm
గ్లోబల్ స్టార్‌గా రాణిస్తోన్న దీపికా పదుకొనె ప్రధాన పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ చిత్రం 'పద్మావతి'. అద్భుత కళాఖండాలు తెరకెక్కించే సంజరు లీలా భన్సాలీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్ గురువారం విడుదలైంది. దేశ వ్యాప్తంగా నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన సందర్భంగా అభిమానులకు దసరా కానుకగా దీపిక ఈ చిత్ర ఫస్ట్‌లుక్ పోస్టర్లను తన ఇన్స్టాగ్రాం ద్వారా పంచుకుంది. సంజరు లీలా భన్సాలీ మార్క్ విజువల్ పీస్ట్తో ఉన్న ఈ ఫస్ట్‌లుక్‌లో పద్మావతి పాత్రలో దీపికా పదుకొనె గెటప్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది. రాచరిక ఆహార్యంతో, రాజసం, ధీరత్వం గల రాణిగా దీపిక ఈ ఫస్ట్‌లుక్ పోస్టర్స్‌లో కనిపిస్తోంది.
13, 14వ శతాబ్ద మధ్య కాలంలో సింగళ (శ్రీలంక) రాజ్యాన్ని పాలించిన రాజు రతన్ సేన్ భార్య, యువరాణి పద్మావతి. దీపికా పదుకొనె పద్మావతిగా నటిస్తున్న ఈ చిత్రంలో ఆమె భర్త రతన్ సేన్‌గా షాహిద్ కపూర్, ఢిల్లీ సుల్తాన్ అల్లావుద్దీన్ ఖిల్జీగా రణ్వీర్ సింగ్ నటిస్తున్నారు. దీపికా పదుకొనె, రణ్వీర్ సింగ్, సంజరు లీలా భన్సాలీ కాంబినేషన్లో 'బాజీరావ్ మస్తానీ' చిత్రం తర్వాత వస్తోన్న ఈ పీరియాడికల్ చిత్రంపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 1న విడుదల చేయనున్నారు. దీపికా పదుకొనె ఆ తర్వాత బాలీవుడ్ మాఫియా క్వీన్ సప్పా దీదీ జీవితంపై, అలాగే బాడ్మింటన్ క్రీడాకారిణి పి.వి.సింధు జీవితాలపై రూపొందే బయోపిక్‌లలో నటించనుంది. ఇవి వచ్చే ఏడాది పట్టాలెక్కనున్నాయి.