Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శర్వానంద్, మెహరీన్ జంటగా మారుతి దర్శకత్వంలో యు.వి.క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'మహానుభావుడు'. సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం గురించి నిర్మాతలు మాట్లాడుతూ, 'ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన లభించింది. థమన్ అందించిన బాణీలు శ్రోతలను అలరిస్తున్నాయి. తాజాగా సెన్సార్ పూర్తి చేసుకుని 'యు/ఎ' సర్టిఫికెట్‌ను పొందింది. ఈ నెల 24న ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ నిర్వహించబోతున్నాం. దసరా కానుకగా ఈ నెల 29న సినిమాను గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నాం. పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందిన ఈ చిత్రాన్ని ఇంటిల్లిపాది ఆనందించేలా దర్శకుడు మారుతి తెరకెక్కించారు. హీరో శర్వానంద్ ఓసిడి పాత్రలో ఒదిగిపోయి నటించారు. అతిపరిశుభ్రత అనే కాన్సెప్ట్ట్తో మారుతి చేయించిన కామెడీ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుంది. మెహరీన్ అందం, అభినయం ఆకట్టుకుంటుంది. మా బ్యానర్లో వస్తున్న మరో సూపర్ హిట్ చిత్రమిది' అని అన్నారు. వెన్నెల కిషోర్, నాజర్, భద్రం, కళ్యాణి నటరాజ్, భాను, హిమజ, వేణు, సుదర్శన్, సాయి, వెంకి, శంకర్రావు, రామాదేవి, మధుమణి, రాగిణి, రజిత, అబ్బులు చౌదరి, సుభాష్, ఆర్.కె. తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: నిజార్ షఫి, ఆర్ట్: రవీందర్, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు.