Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'తెలివైన, ఆదర్శవంతమైన, ధైర్యవంతమైన, అల్లరి అమ్మాయి మలాలా గురించి చెప్పాలంటే ఓ నవలే రాయగలను' అని అంటోంది ప్రియాంక చోప్రా.
యునిసెఫ్ సుహృద్భావ రాయబారిగా ఉన్న ప్రియాంక న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యింది. ఈ సందర్భంగా నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్జారుతో ప్రియాంక కాసేపు ముచ్చటించింది. ఈ నేపథ్యంలో మలాలాను ఉద్దేశించి ప్రియాంక చెబుతూ, 'మలాలా.. నీకు చాలా గొప్ప శక్తి ఉంది. అది ఈ ప్రపంచానికి తెలుసు. భవిష్యత్ తరాలకు ఓ మంచి ప్రపంచాన్ని అందించాలనుకునే యువతీయువకులకు నీవు ఆదర్శప్రాయం. నీతో, మీ నాన్నతో మాట్లాడిన కొద్ది గంటల్లోనే నీ ఆశయాలు నాకు అర్థమయ్యాయి.
మీ నాన్నతో మాట్లాడినంత సేపు మా నాన్న గుర్తొచ్చారు. నీ మాటలు వింటుంటే నీకు ఎంత బాధ్యత ఉందో అర్థమవుతుంది. ప్రపంచంలోని నాలాంటి ఎందరో మహిళలకు నీవే స్ఫూర్తి.
నిన్ను చూస్తుంటే గర్వంగా ఉంది మై ఫ్రెండ్' అని తెలిపింది. ప్రియాంక ప్రస్తుతం 'క్వాంటికో' మూడవ సీజన్‌తోపాటు 'ఏ కిడ్ లైక్ జేక్', 'ఈజ్‌నాట్ ఇట్ రొమాంటిక్?' వంటి హాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.