Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్, ఆయన తనయ సోనమ్ కపూర్ కలిసి వెండితెరపై మెరవబోతున్నారు. రియల్ లైఫ్ తండ్రీ కూతుళ్లిద్దరూ రీల్ లైఫ్‌లో కూడా ఫాదర్ అండ్ డాటర్గానే నటిస్తుండటం విశేషం. ఈ అరుదైన సన్నివేశం విధు వినోద్ చోప్రా సోదరి షెల్లీ చోప్రా దర్శకురాలిగా మారి తెరకెక్కించబోయే చిత్రంలో చోటు చేసుకోబోతోంది. తండ్రీకూతుళ్ళ మధ్య చోటు చేసుకునే ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని తొలుత సంజరు దత్ ప్రధాన పాత్ర ధారిగా చేయాలనుకున్నారు.
కానీ తాజాగా అనిల్ కపూర్, సోనమ్ కపూర్ తండ్రీకూతుళ్లుగా చేయించాలని చిత్రయూనిట్ భావించిందట. ఈ విషయంపై దర్శకురాలు షెల్లీ చోప్రా మాట్లాడుతూ,'ఈ చిత్రం గురించి వస్తున్న వార్తలు నిజమే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ఆర్టిస్టుల ఎంపికపై దృష్టిపెట్టాం. పూర్తి వివరాలు త్వరలోనే ప్రకటిస్తాం' అని తెలిపింది. సోనమ్ ప్రస్తుతం సంజరుదత్ బయోపిక్‌తోపాటు 'ప్యాడ్‌మ్యాన్', 'వీర్ ది వెడ్డింగ్' చిత్రాల్లోనూ నటిస్తోంది. అలాగే అనిల్ కపూర్ 'ఫన్నీ ఖాన్' చిత్రంలో నటిస్తున్నారు.