Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నారా రోహిత్ హీరోగా పవన్ మల్లెలను దర్శకుడిగా పరిచయం చేస్తూ సరస్‌చంద్రిక విజనరీ మోషన్ పిక్చర్స్, మాయా బజార్ మూవీస్ పతాకాలపై బి.మహేంద్ర బాబు, ముసునూను వంశీ, శ్రీ వినోద్ నందమూరి సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం 'బాలకృష్ణుడు'. రెజీనా కథానాయికగా నటిస్తున్న ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను శనివారం విడుదల చేశారు. ఈ సందర్భంగా నిర్మాతలు మాట్లాడుతూ, 'నారా రోహిత్ గత చిత్రాలకు భిన్నంగా యాక్షన్, రొమాన్స్, అద్భుతమైన పాటలు ఇలా అన్ని వాణిజ్య హంగులతో కంప్లీట్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రూపొందిస్తున్నాం. ఈ సినిమా కోసం తొలిసారి నారా రోహిత్ సిక్స్ ప్యాక్ చేయడం విశేషం. ఇటీవల నారా రోహిత్ పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ లోగోకు మంచి స్పందన లభించింది. దేవి నవరాత్రులు సందర్భంగా నారా రోహిత్ హ్యాండ్సమ్ లుక్‌తో ఉన్న ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయడం చాలా ఆనందంగా ఉంది. అలాగే విజయదశమి కానుకగా టీజర్ విడుదల చేస్తున్నాం. నూతన దర్శకుడు పవన్ మల్లెల సినిమాను అద్భుతమైన పక్కా కమర్షియల్ చిత్రంగా తెరకెక్కించారు. పృథ్వీ, వెన్నెలకిషోర్, రఘుబాబు కామెడీ ట్రాక్ ఆడియెన్స్‌ను ఎంటర్టైన్ చేస్తుంది. మణిశర్మ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు పెద్ద అసెట్ అవుతుంది. 'నరసింహ' చిత్రంలో నీలాంబరిగా, 'బాహుబలి'లో చిత్రంలో శివగామిగా మెప్పించిన రమ్యకృష్ణ ఈ చిత్రంలో మరో పవర్ఫుల్ రోల్లో నటించడం విశేషం' అని అన్నారు. ఆదిత్య మీనన్, కోట శ్రీనివాసరావు, దీక్షాపంత్, పియా బాజ్పారు, అజరు, తేజస్విని, శ్రావ్యరెడ్డి, వెన్నెలకిషోర్, శివప్రసాద్, రఘుబాబు, రామరాజు, శ్రీనివాస్‌రెడ్డి, దువ్వాసి మోహన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కథ-మాటలు : కొలుసు రాజా, సినిమాటోగ్రఫీ: విజరు సి.కుమార్. ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఆర్ట్: ఆర్.కె.రెడ్డి.