Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'బాహబలి' తర్వాత ప్రభాస్ నటించే చిత్రంపై అందరిలోనూ అమితాసక్తి నెలకొంది. ఆ అంచనాలకు తగ్గట్టుగానే సుజిత్ దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న 'సాహో' చిత్రంలో ప్రభాస్ నటిస్తున్నారు. హై టెక్నికల్ స్టాండర్స్డ్లో అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో తెలుగు, తమిళం, హిందీలో ఈ చిత్రాన్ని యువి క్రియేషన్స్ పతాకంపై వంశీ, ప్రమోద్‌లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ప్రభాస్ ఎలా కనిపించ బోతున్నారనే క్యూరియాసిటీకి తెర దించుతూ సామాజిక మీడియాలో ప్రభాస్ ఫొటో ఒకటి హల్చల్ చేస్తోంది. ఇందులో ఆయన తెలుపు రంగు చొక్కా, బూడిద రంగు ప్యాంటు, మెడలో సన్నని దండతో క్లాస్‌గా కనిపిస్తున్నారు. తాజాగా చిత్రంలో ఆయన లుక్ ఇలానే ఉంటుందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ సరసన బాలీవుడ్ కథానాయిక శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తున్న విషయం విదితమే. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.