Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎన్టీఆర్ అవార్డులు - కమల్‌హాసన్, కె.రాఘవేంద్రరావు, రజనీకాంత్
- రఘుపతి వెంకయ్య పురస్కారం - కృష్ణంరాజు, ఈశ్వర్, చిరంజీవి
- ఉత్తమ చిత్రాలు - లెజెండ్, బాహుబలి, పెళ్లిచూపులు
- ఉత్తమ నటుడు - బాలకృష్ణ, మహేష్‌బాబు, ఎన్టీఆర్
- ఉత్తమ నటి - అంజలి, అనుష్క, రీతూవర్మ
గత నాలుగేండ్లుగా ఎదురు చూస్తున్న ఆంధ్ర ప్రదేశ్ నంది అవార్డుల ప్రకటన వచ్చేసింది. 2014, 15, 16 సంవత్సరాలకుగాను నంది అవార్డులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. 2014 - ఉత్తమ నటుడిగా బాలకృష్ణ (లెజెండ్), 2015-ఉత్తమ నటుడు మహేష్‌బాబు (శ్రీమంతుడు), 2016 - ఉత్తమ నటుడిగా ఎన్టీఆర్ (జనతా గ్యారేజ్) నంది అవార్డులకు ఎంపికయ్యారు. ఇక 2014లో ఉత్తమ చిత్రంగా 'లెజెండ్' నిలిచింది. 2015 - 'బహుబలి', 2016 - 'పెళ్ళిచూపులు' చిత్రాలు నంది పురస్కారాలకై ఎంపికయ్యాయి. ఎన్టీఆర్ జాతీయ అవార్డులు కమల్ హాసన్ (2014), కె.రాఘవేంద్రరావు (2015), రజనీకాంత్ (2016)లకు దక్కాయి. జ్యూరీ కమిటీ సభ్యులు బాలకృష్ణ, మురళీమోహన్, గిరిబాబు, జీవిత మంగళవారం అమరావతిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మూడేండ్లకు సంబంధించిన నంది అవార్డు విజేతల జాబితాను వెల్లడించారు.
2014.. ఉత్తమ చిత్రం: 'లెజెండ్', 'ఉత్తమ నటుడు: బాలకృష్ణ(లెజెండ్), ప్రజాదరణ పొందిన సినిమా: లౌక్యం, ప్రతినాయకుడు: జగపతిబాబు(లెజెండ్), సహాయ నటుడు: నాగచైతన్య(మనం), ద్వితీయ ఉత్తమ చిత్రం: 'మనం', ఉత్తమ నటి: అంజలి(గీతాంజలి), కెమెరామెన్: సాయి శ్రీరామ్(అలా ఎలా), కొరియోగ్రాఫర్: ప్రేమ్ రక్షిత్, ఫైట్ మాస్టర్: రామ్ లక్ష్మణ్(లెజెండ్), బాలనటుడు: గౌతమ్ కృష్ణ(నేనొక్కడినే), ఉత్తమ రచయిత: ఎం.రత్నం, ఉత్తమ సహాయ నటి: మంచు లక్ష్మి(చందమామ కథలు), హాస్యనటుడు: బ్రహ్మానందం(రేసుగుర్రం). ఎన్టీఆర్ జాతీయ అవార్డు: కమల్ హాసన్, బీఎన్‌రెడ్డి జాతీయ పురస్కారం: రాజమౌళి, నాగిరెడ్డి:చక్రపాణి జాతీయ సినిమా అవార్డు: ఆర్.నారాయణమూర్తి, రఘుపతి వెంకయ్య పురస్కారం: కృష్ణంరాజు, స్పెషల్ జ్యూరీ: సుద్దాల అశోక్ తేజ.
2015.. ఉత్తమ చిత్రం: 'బాహుబలి', ఉత్తమ నటుడు: మహేష్‌బాబు(శ్రీమంతుడు), ఉత్తమ కుటుంబ కథా చిత్రం: 'మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు', బెస్ట్ ఫీచర్ ఫిల్మ్: 'కంచె', బాలల చిత్రం: 'దానవీర శూర కర్ణ', ఉత్తమ నటి: అనుష్క(సైజ్ జీరో), దర్శకుడు: రాజమౌళి(బాహుబలి), ద్వితీయ ఉత్తమ చిత్రం: 'ఎవడే సుబ్రమణ్యం', తృతీయ చిత్రం: 'నేను శైలజ', ఉత్తమ హాస్యనటుడు: వెన్నెల కిశోర్(భలే భలే మగాడివోరు), మాటల రచయిత: సాయిమాధవ్(మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు), ఉత్తమ సంగీత దర్శకుడు: ఎం.ఎం.కీరవాణి. ఎన్టీఆర్ జాతీయ అవార్డు: కె.రాఘవేంద్రరావు, బీఎన్‌రెడ్డి జాతీయ పురస్కారం: త్రివిక్రమ్, నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ అవార్డు: కీరవాణి, రఘపతి వెంకయ్య పురస్కారం: పిబ్లిసిటీ డిజైనర్ ఈశ్వర్, స్పెషల్ జ్యూరీ : పీసీ రెడ్డి, 2016.. ఉత్తమ చిత్రం: 'పెళ్ళిచూపులు', ఉత్తమ నటుడు: ఎన్టీఆర్(జనతా గ్యారేజ్), ద్వితీయ ఉత్తమ చిత్రం: ' అర్ధనారి', తృతీయ ఉత్తమ చిత్రం: 'మనలో ఒకడు'. ఉత్తమ నటి: రీతూవర్మ(పెళ్ళి చూపులు), ఉత్తమ విలన్: ఆది పినిశెట్టి(సరైనోడు), దర్శకుడు: సతీష్ వెగేష్న: 'శతమానం భవతి', సంగీత దర్శకుడు: మిక్కీ జె మేయర్(అ ఆ). ఎన్టీఆర్ జాతీయ అవార్డు: రజనీకాంత్, బీఎన్‌రెడ్డి జాతీయ పురస్కారం: బోయపాటి శ్రీను, నాగిరెడ్డి-చక్రపాణి జాతీయ అవార్డు: కే.ఎస్.రామారావు, రఘుపతి వెంకయ్య పురస్కారం : చిరంజీవి, స్పెషల్ జ్యూరీ : పరుచూరి బ్రదర్స్.
ఉత్తమ సినీ విమర్శకులు : 2014 - పులగం చిన్నారాయణ, 2015 - కంపెల్ల రవిచంద్రన్,
2016 - విజరు ప్రసాద్ బుక్కా